Homeజాతీయ వార్తలుTS TET Hall Ticket: టెట్ హాల్ టికెట్ల డౌన్ లోడ్ కు మార్గదర్శకాలు ఇవే..

TS TET Hall Ticket: టెట్ హాల్ టికెట్ల డౌన్ లోడ్ కు మార్గదర్శకాలు ఇవే..

TS TET Hall Ticket: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో బాగంగానే కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఇప్పటికే నోటిఫికేషన్ వేయడంతో నిరుద్యోగుల్లో ఆశలు పెరుగుతున్నాయి. ఉద్యోగాలు సాధించేందుకు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఎలాగైనా ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడాలని భావిస్తున్నారు. దానికనుగుణంగానే కష్టపడుతున్నారు. నిరంతరం చదవుతూ పోటీ పరీక్షలో నెగ్గాలని ప్రయత్నిస్తున్నారు.

TS TET Hall Ticket
TS TET Hall Ticket

ఈ నేపథ్యంలో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా నేటి నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ రోజు మధ్యాహ్నం 1.30 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించింది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని తెలియజేస్తోంది. జూన్ 12న టెట్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Also Read: Samantha- Ranveer Singh: రన్వీర్ తో సమంత… క్రేజీ బాలీవుడ్ ప్రకటించిన స్టార్ లేడీ!

అభ్యర్థులు కొన్ని నియమాలు పాటించి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మొదట అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. తరువాత లింక్ హోం పేజీలో హాల్ టికెట్ కనిపిస్తుంది. ఆ లింక్ పై ఓపెన్ చేస్తే కొత్త పేజీ వస్తుంది. అభ్యర్థి ఐడీతో పాటు వివరాలు నమోదు చేయాలి. దీంతో హాల్ టికెట్ కనిపించడంతో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అనంతరం దాన్ని పీడీఎఫ్ లో ఉంచుకోవాలి. టెట్ కోసం అభ్యర్థులు ఇప్పటికే ప్రిపర్ అయ్యారు. ఇక పరీక్షలో ఎక్కువ స్కోరు సాధించి ఉద్యోగ కల్పనలో వెయిటేజీ వచ్చేలా చూసుకోవాలని చూస్తున్నారు.

TS TET Hall Ticket
TS TET Hall Ticket

జూన్ 12న ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్ -1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ -2 నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పేపర్ -1కు 3,51,468 మంది పేపర్ -2కు 2,77,884 మంది అభ్యర్థులు రాయనున్నారు. దీంతో పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పకడ్బందీ నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని భావిస్తోంది.

Also Read:Vikram collections: విక్రమ్ కలెక్షన్స్… బాక్సాఫీస్ వద్ద కమల్ విశ్వరూపం

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

1 COMMENT

Comments are closed.

Exit mobile version