TS Tet Notification 2022: తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీ కోసం సర్కారు కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 12 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. జూన్ 12న టెట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు అభ్యర్థులు ఇప్పటికే పుస్తకాలు తిరగేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని కుస్తీ పడుతున్నారు.

ఈ సారి ప్రభుత్వం బీఈడీ అభ్యర్థులకు మరో బంపర్ ఆఫర్ అందజేస్తోంది. గతంలో బీఈడీ అభ్యర్థులు పేపర్ 2 మాత్రమే రాసే వీలుండేది. ఇప్పుడు సడలించిన నిబంధనల కారణంగా పేపర్ 1 కూడా రాసుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో దరఖాస్తు ప్రారంభ తేదీ మార్చి 26 కాగా చివరి తేదీ ఏప్రిల్ 12గా నిర్ణయించారు. ఆన్ లైన్ ఫీజు పేమెంట్ 26 నుంచే ప్రారంభం కానుంది.
పేపర్ 1 జూన్ 12న ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు , పేపర్ 2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితాల విడుదల జూన్ 27న జరగనుంది. దీంతో అభ్యర్థులు ఇక జాబ్ కొట్టడమే లక్ష్యంగా ముందుకు వెళ్లనున్నారు. ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలనే ఉద్దేశంతో కోచింగులకు వెళ్తున్నారు. దీంతో కోచింగ్ సెంటర్లు కళకళలాడుతున్నాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయంతో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగుల ఆశలకు రెక్కలు వచ్చినట్లు అయింది. ఇన్నాళ్లు గవర్నమెంట్ ఉద్యోగం కోసం వేయి కళ్లతో ఎదురు చూసినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు కేసీఆర్ ప్రకటించిన ఉద్యోగాల్లో ఏదో ఒక జాబ్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఉద్యోగం పురుష లక్షణమని భావించి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తానికి సర్కారు నిరుద్యోగులకు మంచి అవకాశమే ఇచ్చింది.
[…] BJP vs TRS: తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై ప్రత్యక్ష పోరాటానికే సిద్ధమైంది. ధాన్యం కొనుగోలును రాజకీయం చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక సంస్థల్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాలని భావిస్తోంది. దీనికి గాను తేదీలు కూడా ఖరారు చేసింది. ఈ క్రమంలో కేంద్రంపై ఒత్తిడి పెంచాలని వ్యూహం రచిస్తోంది. నేటి నుంచే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది. దీనికి గాను ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. […]
[…] Teacher Love With Student: విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయురాలు ప్రేమ పాఠాలు వళ్లించింది. ఏకంగా తన స్కూలులోని బాలుడినే తన ప్రేమికుడిగా ఎంచుకుంది. అతడితో తరచుగా ఫోన్ లో మాట్లాడుతూ ప్రేమలో దించింది. రహస్యంగా తీసుకుపోయి గుడిలో వివాహం చేసుకుంది. దీంతో అతడి తల్లిదండ్రులు కంగారు పడ్డారు. తమ బాబు ఎక్కడ అని ఆరా తీశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు రంగంలోకి దిగి విచారించగా అతడి స్కూల్లో పనిచేసే టీచరే అతడిని తీసుకెళ్లినట్లు గుర్తించారు. […]