https://oktelugu.com/

KGF 2 Update: ముఖ్య అతిథిగా నిజంగానే ప్రభాస్ వస్తున్నాడా ?

KGF 2 Update: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వస్తున్న ‘కేజీఎఫ్ 2’ కోసం యావత్తు మాస్ ప్రేక్షక లోకం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తోన్నారు. ఏప్రిల్‌ 14న సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ను ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ప్రభాస్ హాజరు కాబోతున్నారు. మరి ప్రభాస్ వస్తే.. ఈ సినిమా పై అంచనాలు భారీగా […]

Written By:
  • Shiva
  • , Updated On : March 25, 2022 / 06:08 PM IST
    Follow us on

    KGF 2 Update: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వస్తున్న ‘కేజీఎఫ్ 2’ కోసం యావత్తు మాస్ ప్రేక్షక లోకం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తోన్నారు. ఏప్రిల్‌ 14న సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ను ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ప్రభాస్ హాజరు కాబోతున్నారు.

    KGF 2

    మరి ప్రభాస్ వస్తే.. ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉంటాయి. ఇక ఈ సినిమా విడుదల దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ వేగాన్ని పెంచుతుంది. ఏది ఏమైనా దక్షిణాది పాన్ ఇండియా సినిమాలలో బాహుబలి తర్వాత కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమానే భారీ విజయం సాధించింది. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ను నేషనల్ స్టార్ ను చేసింది.

    Also Read: RRR: అందుకే, రాజమౌళి చరణ్ ను హైలైట్ చేశాడు

    అందుకే కెజిఎఫ్ 2 చిత్రంపై ప్రేక్షకులలో ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోని అన్ని పరిశ్రమల్లో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొని ఉండటంతో ఈ సినిమా ఓపెనింగ్స్ తో సరికొత్త రికార్డ్స్ సృష్టించడం ఖాయం అంటున్నారు. కాగా కెజిఎఫ్ 2 లో మెయిన్ విలన్ అధీరా పాత్రలో సంజయ్ దత్ కనిపించనున్నారు.

    Prabhas

    యష్ ని ఎదుర్కొనే విలన్ గా ఈ బాలీవుడ్ నటుడు ఎలా ఉంటాడో చూడాలి. అలాగే రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ వంటి నటులు కూడా కీలక రోల్స్ చేస్తున్నారు. అందుకే మొదటి భాగానికి మించి అనేక ప్రత్యేకతలు కెజిఎఫ్ 2లో ఉన్నాయి. ఇక ఫస్ట్ పార్ట్ లో ఓ స్పెషల్ సాంగ్ లో అలరించిన తమన్నా.. సెకండ్ పార్ట్ లో మాత్రం కొన్ని యాక్షన్ సీన్స్ లో కూడా కనిపించబోతుందట.

    మొత్తానికి ఈ సినిమా దాదాపు రెండేళ్లు నుండి వాయిదా పడుతూనే వస్తోంది. చివరకు ఏప్రిల్‌ 14న ఈ సినిమా రాబోతుంది. కాగా, ఈ మూవీలో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి, జగపతి బాబు, రావు రమేశ్.. బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టాండన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. హోంబలె పతాకంపై విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

    Also Read: AP Liquor Policy: మద్యం వ్యాపారమే ఏపీ సర్కారుకు ఇంధనమా?

    Tags