Health Director Srinivasa Rao: అందరికీ శకునం చెప్పే బల్లి తాను పోయి కుడితిలో పడిందని సామెత. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు పరిస్థితి కూడా అలాగే మారింది. నీతులు ఉన్నవి చెప్పడానికే గోతులున్నవి తవ్వడానికే అన్నట్లుగా పరిస్థితి తయారయింది. అందరికి కరోనా నిబంధనలు చెప్పే ఆయన మాత్రం వాటిని పాటించడం లేదు. ఒక వైపు మూడో వేవ్ పొంచి ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పిన ఆయనే వాటిని తుంగలో తొక్కారు. మాస్క్ ధరించలేదు. భౌతిక దూరం పాటించలేదు.

కొత్తగూడెంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఆయన నృత్యం చేశారు బుల్లెట్ బండెక్కి వస్తావా అనే పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసి అందరిలో ఆసక్తి పెంచారు. కానీ చివరకు ఆయనే నిబంధనలు ఉల్లంఘించారు. దీనిపై పెద్ద దుమారమే రేగుతోంది. ఆధర్శంగా ఉండాల్సిన అధికారే తప్పు చేయడం ఏమిటని సామాజిక మాధ్యమాల్లో పలు ప్రశ్నలు వస్తున్నాయి. కానీ ఆయన చేసిన దానికి ప్రభుత్వం ఏ మేరకు చర్య తీసుకుంటుందో చూడాల్సిందే అని అందరు చూస్తున్నారు.
ఒక పక్క మూడో వేవ్ పొంచి ఉందని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్న హెచ్ డీ శ్రీనివాసరావు వ్యవహార శైలిపై విమర్శలు వస్తున్నాయి. పండుగల వేళ మరింత అప్రమత్తంగా ఉండాలని చెబుతూనే ఇలా చేయడంపై అందరిలో ఆగ్రహాలు వస్తున్నాయి. అందరికి నిబంధనలు పాటించాలని చెబుతూ తాను మాత్రం ఇష్టమొచ్చినట్లు చిందులేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. స్టెప్పులు వేస్తూ చిందులు తొక్కడం ఆయనకే చెల్లుతుందని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
గతంలో కూడా వినాయక చవితి వేళ ఆయన ఇదే విధంగా నృత్యం చేస్తూ దొరికిపోయారు. కరోనా వేళ శ్రీనివాస రావు వ్యవహరించిన తీరుపై అందరిలో ఆశ్చర్యం కలుగుతోంది. ఆదర్శంగా ఉండాల్సిన ఆయనే ఇలా అడ్డంగా బుక్కవ్వడం వెనుక కారణాలు ఏవైనా ఆయనకు మచ్చ వచ్చింది. మరోవైపు డెల్టా వేరియంట్ గుబులు పుట్టిస్తుంటే ఆయన మాత్రం పట్టించుకోవడం లేదు.