KCR Back Step On BRS: తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌స్‌ను వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌పై సహజంగానే రాష్ట్రంలో వ్యతిరేకత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా ముందస్తుకు వెళ్లాలని గులాబీ బాస్ ఆలోచిస్తున్నారు. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు ఆయన వ్యూహాన్ని పసిగట్టాయి. ముందస్తు ఎప్పుడ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో కేసీఆర్ ముందస్తు ఆలోచనపై వెనుకడుగు వేశారు. తాజాగా రాష్ట్రంలో పెరుగుతున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్) అంటూ లీకులు ఇచ్చారు. ఈమేరకు కసరత్తు చేస్తున్నట్లు ప్రకటించారు కూడా. పలు సభల్లో దేశరాజకీయాలకు వేళ్తా.. మీ ఆశీర్వాదం కావాలంటూ ప్రజలు కూడా కోరారు. ఇందులో భాగంగా ఢిల్లీ, పంజాబ్, మహారాష్ట్ర, తమిళనాడు, జార్ఖండ్ ముక్యమంత్రులతో, ఉత్తరప్రదేశ్ ప్రతిపక్ష నేత అఖిలేష్‌యాదవ్‌తో సమావేశాలు నిర్వహించారు. త్వరలో సంచలన వార్త వింటారు అని కూడా ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీలకే వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ ఎజెండాతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో చక్రం తిప్పాలని చూశారు. కానీ తృణమోల్ అధినేత్రి రాష్ట్రపతి ఎన్నికలను తనకు అనుకూలంగా మలుచుకుంది. బీజేపీయేతర పార్టీలతో సమావేశం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ను ఆహ్వానించినా సమావేశానికి వెళ్లలేదు. కానీ తర్వాత తప్పనిసరిగా విపక్షాల అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితిని టీఆర్‌ఎస్‌కు కల్పించడంలో మమత సక్సెస్ అయ్యారు.
బీఆర్‌ఎస్ హడావుడేనా?
కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయ ఎజెండాతో దేశ రాజకీయాల్లోకి రావాలని కేసీఆర్ ఆలోచించారు. ఈమేకు మేధావులు, సీనియర్ రాజకీయ నాయకులు, రిటైర్డ్ అధికారులతో మంతనాలు జరిపారు. జూన్ 23వ తేదీలోపు పార్టీ ప్రకటన ఉంటుందని మీడియాకు లీకులు కూడా ఇచ్చారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్ ఈమేరకు వ్యూహరచన కూడా చేశారు. కానీ గడవు ముగిసింది. బీఆర్‌ఎస్ ప్రకటన మాత్రం రాలేదు.
Also Read: AB Venkateswararao: అధికారం ముందు మోకరిల్లాల్సిందే.. ఏబీ వెంకటేశ్వరరావుపై వేటు దేనికి సంకేతం?
ఆషాఢం అడ్డంకి..
ముహూర్తాలపై పట్టింపు ఎక్కువ ఉన్న కేసీఆర్ జూలైలో పార్టీ ప్రకటించే అవకాశాలు లేవు. ప్రస్తుతం ఆషాఢమాసం ప్రారంభం అయిన నేపథ్యంలో పార్టీ ప్రకటించే అవకాశం లేదనే చెప్పవచ్చు. అయితే బీఆర్‌ఎస్ ఉంటుందా లేదా అనే విషయంలో మాత్రం ఇప్పుడు పార్టీ నేతలు ఎవరూ నోరు మెదపడం లేదు. తెలంగాణ ముఖ్యమైన మంత్రి కె.తారకరామారావు మాత్రం ఇటీవల సమయం రాగానే జాతీయ పార్టీ ప్రకటన ఉంటుందని ప్రకటించారు. కేంద్రంపై తిరుగుబాటు తెలంగాణ నుంచి మొదలు కావొచ్చని అన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఇంకా లైవ్‌లో ఉన్నట్లే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అనువు కానిచోట అధికుల మనరాదని..
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జాతీయ పార్టీ ప్రకటించడం మంచిది కాదనే భావనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీపై దృష్టిపెడితే రాష్ట్రంలో పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందని, వచ్చే ఎన్నికల్లో పరాభవం తప్పదన్న అంచనా వేస్తున్నట్లు తెలిసింది. జాతీయ పార్టీ పెట్టాలంటే ముందుగా రాష్ట్రంలో గెలవాలని కేసీఆర్ బావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బీఆర్‌ఎస్ ఆలోచన పక్కన పెట్టినట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు చూస్తుంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా త్రిముఖ పోరు తప్పదన్న సంకేతాలు వస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు బీజేపీ, కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డేందుకు సన్నద్ధమయ్యాయి. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు టీఆర్‌ఎస్‌కు అంత ఈజీ కాదన్న అ్రప్రాయమూ వ్యక్తమవుతోంది.
కాంగ్రెస్ తో కలవక తప్పని పరిస్థితి..
కేసీఆర్ బీఆర్‌ఎస్ ఏర్పాటు చేసినా బీజేపీని ఎదుర్కొనాలంటే దేశంలోని బీజేపీ యేతర పార్టీలన్నీ ఒక్కటి కావాలన్న అభిప్రాయం విపక్షాల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలకు సమానదూరం అంటున్న కేసీఆర్‌కు కాంగ్రెస్ కంటే ప్రస్తుతం బీజేపీపైనే ఎక్కువ కోపం ఉంది. మోదీని గద్దె దించడమే ఆయన లక్ష్యంగా కనబడుతోంది. దీంతో బీఆరఎస్ ప్రకటిస్తే రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌తో కలవక తప్పని పరిస్థితి ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఇది జరిగితే కాంగ్రెస్‌తోపాటు టీఆర్‌ఎస్‌కు కూడా లాభం జరుగుతుందని గులాబీ అధినేత భావిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి మెరారిటీ రాకపోతే బీజేపీకి అవకాశం దక్కకుండా చేయడానికి కాంగ్రెస్‌తోనూ చేతులు కలిపే పరిస్థితి రావొచ్చన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం.
Also Read:India Corona: లక్షకు పైగా యాక్టివ్ కేసులు.. కరోనా దేశాన్ని కమ్మేస్తోందా?