https://oktelugu.com/

Alia Bhatt: పెళ్ళి తర్వాత అలియా భట్ పెడుతున్న కండీషన్స్ ఇవే ?

Alia Bhatt: పెళ్లి తర్వాత ఇక అలియా భట్ సినిమాల్లో నటించదు అని ప్రచారం చేశారు. కానీ, పిల్లలు పుట్టాక కూడా నటిస్తాను అంటూ అలియా ఓపెన్ గా చెప్పేసింది. మొత్తానికి రణబీర్ తో ఐదేళ్ళ ప్రేమాయణానికి పెళ్ళి బంధంతో తెరదింపింది అలియా. అలియా భట్ తిరిగి మూవీస్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు వినిపించడంతో ఆమె ఫ్యాన్స్ అంతా సంబరపడిపోతున్నారు. అయితే అలియా భట్ కొత్తగా ఒకే చేసే ప్రాజెక్ట్స్‌కు సంబంధించి ఆమె ఒక నిర్ణయానికి […]

Written By:
  • Shiva
  • , Updated On : June 30, 2022 / 01:58 PM IST
    Follow us on

    Alia Bhatt: పెళ్లి తర్వాత ఇక అలియా భట్ సినిమాల్లో నటించదు అని ప్రచారం చేశారు. కానీ, పిల్లలు పుట్టాక కూడా నటిస్తాను అంటూ అలియా ఓపెన్ గా చెప్పేసింది. మొత్తానికి రణబీర్ తో ఐదేళ్ళ ప్రేమాయణానికి పెళ్ళి బంధంతో తెరదింపింది అలియా. అలియా భట్ తిరిగి మూవీస్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు వినిపించడంతో ఆమె ఫ్యాన్స్ అంతా సంబరపడిపోతున్నారు.

    alia bhatt and ranbir kapoor

    అయితే అలియా భట్ కొత్తగా ఒకే చేసే ప్రాజెక్ట్స్‌కు సంబంధించి ఆమె ఒక నిర్ణయానికి వచ్చారు. పెళ్ళి తర్వాత అలియా భట్ చేయబోయే సినిమాలకు కొన్ని కండీషన్స్ పెడుతున్నారు. ఇప్పటికే తనను సంప్రదించిన డైరెక్టర్ లకు అలియా భట్ కొన్ని నిబంధనలు విధించి వాటికి అంగీకరిస్తేనే కొత్త ప్రాజెక్టులకు కమిట్‌ అవ్వాలనుకుంటున్నారు.

    Also Read: Allari Naresh Birthday: హ్యాపీ బర్త్ డే నరేష్.. నవ్వించు.. ఎప్పటికీ ఇలాగే నిలిచిపో !

    ఇంతకీ అలియా భట్ షరతులు ఏమిటంటే.. హీరోలతో రొమాన్స్‌, పడక గది సన్నివేశాలు, సున్నిహితంగా ఉండే సన్నివేశాలతో పాటు డ్యూయట్ సాంగ్స్‌ కు దూరంగా ఉండాలనే అలియా నిర్ణయించుకున్నారట. ఇప్పటికే అలియా పలు ప్రాజెక్ట్స్ కు గతంలోనే ఓకే చెప్పేశారు. ఆ సినిమాల వరకు మాత్రం బోల్డ్ సీన్స్ లో అలియా నటిస్తోందట.

    alia bhatt and ranbir kapoor

    కాకపోతే, పెళ్ళి తర్వాత కొత్త ప్రాజెక్ట్స్ ఒప్పుకునేందుకు మాత్రమే అలియా భట్, డైరెక్టర్ లకి కండీషన్స్ పెడుతోందన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి దీనిపై అలియా భట్ ఏం క్లారిటీ ఇస్తుందో వేచి చూడాలి.

    రణబీర్ కపూర్ – ఆలియా భట్ ఏప్రిల్ 14న వివాహంతో ఒక్కటి అయ్యారు. త్వరలోనే వీరిద్దరూ తల్లిదండ్రులుగా మారనున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో వీరిద్దరూ తమ మొదటి బిడ్డకు స్వాగతం పలకబోతున్నారని తెలుస్తోంది. ఆలియా సోనోగ్రఫీ చేయించుకుంటున్న ఫోటోను పోస్ట్ చేడి సోషల్ మీడియాలో ఈ వార్తను పంచుకున్న సంగతి తెలిసిందే.

    ఏది ఏమైనా బాలీవుడ్ లోనే క్రేజీ జంటగా ఈ జంటకు నేమ్ ఉంది. రణబీర్ కపూర్ ఒక్కో సినిమాకు 60 కోట్లు తీసుకుంటున్నాడు. అలియా ఒక్కో సినిమా 8 కోట్లు డిమాండ్ చేస్తోంది. సంపాదన పరంగానే కాకుండా ఆస్తుల పరంగా లెక్కలు వేసుకున్నా ఈ జంటకి 800 కోట్లు నెట్ వర్త్ ఉంది.

    Also Read:Pavithra Lokesh- Naresh: ఆయనతో సహజీవనం చేస్తున్నా.. నరేష్ తో పెళ్లిపై బాంబు పేల్చిన పవిత్రలోకేష్

    Tags