https://oktelugu.com/

Sreeleela: మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయిన ప్లాప్ హీరోయిన్ !

Sreeleela: టీనేజ్ బ్యూటీ శ్రీలీల తెలుగు తెరకు పరిచేయమవుతూనే వరుస ఆఫర్స్ తో టాప్ హీరోయిన్స్ సైతం ఈర్ష్య పడేలా చేస్తోంది. మొదటి సినిమాలోనే శ్రీలీల తన క్యూట్ నెస్ తో అందరినీ కట్టిపడేసింది. ఇండస్ట్రిలోకి అడుగుపెడుతూనే బ్యాక్ టు బ్యాక్ సినిమా ఛాన్స్ లు అందుకుంటూ ఫుల్ బిజీగా మారిపోయింది. పైగా ఈ అమ్మడికి తెలుగు సినిమాలతో పాటు తమిళంలోనూ భారీ ఆఫర్స్ వస్తుండటం విశేషం. తాజాగా శ్రీలీల స్టార్ హీరోలతో కూడా రొమాన్స్ చేయబోతోంది. […]

Written By:
  • Shiva
  • , Updated On : June 30, 2022 / 02:11 PM IST
    Follow us on

    Sreeleela: టీనేజ్ బ్యూటీ శ్రీలీల తెలుగు తెరకు పరిచేయమవుతూనే వరుస ఆఫర్స్ తో టాప్ హీరోయిన్స్ సైతం ఈర్ష్య పడేలా చేస్తోంది. మొదటి సినిమాలోనే శ్రీలీల తన క్యూట్ నెస్ తో అందరినీ కట్టిపడేసింది. ఇండస్ట్రిలోకి అడుగుపెడుతూనే బ్యాక్ టు బ్యాక్ సినిమా ఛాన్స్ లు అందుకుంటూ ఫుల్ బిజీగా మారిపోయింది. పైగా ఈ అమ్మడికి తెలుగు సినిమాలతో పాటు తమిళంలోనూ భారీ ఆఫర్స్ వస్తుండటం విశేషం.

    Sreeleela

    తాజాగా శ్రీలీల స్టార్ హీరోలతో కూడా రొమాన్స్ చేయబోతోంది. కొన్ని పెద్ద హీరోల సినిమాలు శ్రీలీల హోల్డ్ లో ఉన్నాయి. అన్నిటికీ మించి తమిళంలో ఈ అమ్మడు గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. విలక్షణ దర్శకుడు బాలా – స్టార్ హీరో సూర్య కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాతో కోలీవుడ్ లో కూడా శ్రీలీల అడుగుపెట్టబోతోంది.

    Also Read: Alia Bhatt: పెళ్ళి తర్వాత అలియా భట్ పెడుతున్న కండీషన్స్ ఇవే ?

    ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆల్ రెడీ చిత్రబృందం శ్రీలీలతో అగ్రిమెంట్ కూడా చేయించుకున్నారని టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే శ్రీలీల మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. ధనుష్ హీరోగా అరుణ్ మాధ్యరేశ్వరన్ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా శ్రీలీలని కన్ఫర్మ్ చేశారని తెలుస్తోంది. తొలత ఈ సినిమా కోసం ప్రియాంక అరుళ్ మోహన్ ని అనుకున్నారు.

    Sreeleela

    కానీ ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకుంది. రెమ్యునరేషన్ విషయంలో ప్రియాంక అరుళ్ మోహన్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆ ఛాన్స్ శ్రీలీలని వరించింది అని కోలీవుడ్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఇక తెలుగులో కూడా ఈ బ్యూటీ వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే రవితేజ సినిమాలో హీరయిన్ గా నటిస్తోంది. అలాగే కళ్యాణ్ రామ్ తో కూడా ఒక సినిమా చేస్తోంది.

    అసలు ఒక కొత్త హీరోయిన్.. అదీ ఏ మాత్రం సక్సెస్ లేని హీరోయిన్ కి ఈ స్థాయిలో డిమాండ్ క్రియేట్ అవ్వడం.. నిజంగా విశేషమే. మొత్తానికి శ్రీలీల టైమ్ బాగుంది. ఒక్క హిట్ లేకపోయినా.. స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయేలా ఉంది. ఒక్కటి మాత్రం నిజం ఈ ప్లాప్ హీరోయిన్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది.

    Also Read:Allari Naresh Birthday: హ్యాపీ బర్త్ డే నరేష్.. నవ్వించు.. ఎప్పటికీ ఇలాగే నిలిచిపో !

    Tags