telangana Municipal Vice-Chairman Booked : తెలంగాణలో అధికార పార్టీ నేతపై అత్యాచార కేసు నమోదు కావడం సంచలనమైంది. నిర్మల్ జిల్లాలోని ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై మున్సిపల్ వైస్ చైర్మన్ పై కేసు నమోదైంది. నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్, టీఆర్ఎస్ నేతపై పోలీసులు లైంగిక నేరాల బాలల రక్షణ చట్టం (పోక్సో) కింద కేసు నమోదు చేయడంతో ఆయన పారిపోయారు. ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన్ను పట్టుకునేందుకు నాలుగు బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు. నిందితుల కోసం నిర్మల్, ఆదిలాబాద్, భైంసా తదితర పట్టణాల్లో పోలీసులు గాలిస్తున్నారు.నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామన్నారు.

గత నెలలో హైదరాబాద్ లో 15 ఏళ్ల బాలికపై మున్సిపల్ వైస్ చైర్మన్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కుటుంబం నివసించే ఇంటి యజమాని అయిన ఓ మహిళ సాయంతో నిందితుడు తనను తీసుకెళ్లి అత్యాచారం చేశాడని బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ప్రస్తుతం మైనర్ బాలిక 8వ తరగతి చదువుతోంది. బాలికను చైల్డ్ హెల్ప్ లైన్ కు తరలించారు. వారి ద్వారా మున్సిపల్ వైస్ చైర్మన్ పై ఫిర్యాదు చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి ప్రాథమిక విచారణ అనంతరం అతడిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఇంటి యజమాని, కారు డ్రైవర్ పై కూడా కేసు నమోదు చేశారు.
బాలికను ఓ ఫంక్షన్ పేరుతో హైదరాబాద్ కు తీసుకెళ్లారని.. ఓ హోటల్ లో నిందితులు ఈ దారుణానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు తెలిపింది. బాలిక ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు వెల్లడించింది. వారు చైల్డ్ హెల్ప్ లైన్ ను సంప్రదించారు. తరువాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
[…] […]