Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. గతంలో పవన్‌కి వ్యతిరేకంగా మాట్లాడి, వైఎస్‌ఆర్‌సీపీలో చేరి, ఎస్‌వీబీసీ ఛానెల్‌కి చైర్మన్ కూడా అయిన పృథ్వీరాజ్, ఆతర్వాత వివాదాలతో అన్నిటికీ దూరమయ్యారు. ఇప్పుడు సినిమా అవకాశాలు కూడా తగ్గాయి. ఈక్రమంలో భీమ్లా నాయక్ సినిమా చూశాడట. సినిమా సూపర్ అని, పవన్‌కి దిష్టి తగలకూడదని అన్నాడు. అంతేకాదు, ఎన్‌టీఆర్ తర్వాత ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్‌కే ఉందన్నాడు.

మరో అప్ డేట్ విషయానికి వస్తే.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సాయి పల్లవిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. `ఆడవాళ్లు మీకు జోహార్లు` ప్రీరిలీజ్ ఈవెంట్‌కి సుకుమార్‌తో పాటు, కీర్తి సురేష్, సాయి పల్లవి అతిథులుగా వచ్చారు. ఈక్రమంలో ముగ్గురు (రష్మిక) కూడా మంచి నటీమణులు అని పొగిడిన సుకుమార్, సాయి పల్లవి పేరు ఎత్తగానే అభిమానుల హోరు విని, సాయి పల్లవి ఓ లేడీ పవన్ కళ్యాణ్ అనేశారు. వీరందరికీ గ్యాంగ్ లీడర్ సమంత అని చమత్కరించారు.
Also Read: మరో వివాదంలో చిక్కుకున్న మోహన్ బాబు కుటుంబం.. ఏమైందంటే..?

ఇక ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. తాను ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఓ ఇంటర్వ్యూలో చెప్పేసింది. కొన్నిరోజులుగా హీరో ఇషాన్ ఖట్టర్‌తో ఈ భామ సన్నిహితంగా ఉంటోంది. దానిపై తొలిసారిగా నోరు విప్పింది. అయితే అతడి పేరు మాత్రం చెప్పలేదు. ‘నా మీద అతడి ప్రభావం ఎక్కువగా ఉంది.

అతనిది ప్రేమించే వ్యక్తిత్వం. నాకెప్పుడూ సహకరిస్తూ ఉంటాడు. అతడిని ప్రేమిస్తున్నా. నేను లక్కీ’ అని చెప్పింది. వీరిద్దరూ ఖాలీ పీలి సినిమాలో కలిసి నటించారు.
Also Read: పెద్ద హీరోలు నోరు ఎత్తలేకపోయినా ప్రకాష్ రాజ్ తన గళమెత్తాడు !