Telangana Liquor Rates Increased: తెలంగాణలో మద్యం ధరలకు రెక్కలొచ్చాయి. ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు లేకపోడంతో ఇక మద్యం ధరలు పెంచడమే మార్గంగా భావించుకుంది. దీంతో మద్యం ప్రియుల జేబులు గుళ్ల కానున్నాయి. క్వార్టర్ కు రూ. 20, బీరుపై కూడా రూ. 20 పెంచుతూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశం అయింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మందు బాబులు ఆందోళన చెందుతున్నారు. ఇలా ఎడాపెడా ధరలు పెంచుతుంటే ఎలా అనే ప్రశ్నలు వస్తున్నాయి.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా కుదేలైపోతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం అప్పు ఇచ్చేందుకు నిరాకరిస్తోంది. దీంతో రాష్ట్రానికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ క్రమంలో మద్యం ధరలు పెంచి ఆదాయ మార్గం పెంచుకోవాలని చూస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా మద్యం ధరలు విచ్చలవిడిగా పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు అదే దారిలో తెలంగాణ కూడా వెళ్తుండటం గమనార్హం.
Also Read: Dil Raju Precautions For F3 Release: ఎఫ్ 3 విడుదలకు దిల్ రాజు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏమిటి?
పెంచిన మద్యం ధరలతో ఏటా రూ. ఏడు వేల కోట్ల ఆదాయం పెరగనుంది. ఇప్పటికే ఏడాదికి రూ. 30 వేల కోట్లు రావడంతో ఇప్పుడు ఇంకా ఏడు వేల కోట్లు అదనంగా రావడంతో రాష్ట్ర ఆదాయం పెరిగే అవకాశం ఉంది. దీంతో మద్యం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని సర్కారు భావించింది. ఇదే సమయంలో మద్యం ద్వారా అయితేనే ఆదాయం రాబట్టుకుంటే ఎలాంటి గొడవలు ఉండవని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి ఆదాయ అన్వేషణలో ప్రభుత్వం పడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో మద్యంతో అదనపు ఆదాయం రాబట్టుకోవాలని తలచింది. ఉచిత పథకాలతో ఖర్చు పెరిగినట్లు తెలుస్తోంది. అందుకే ఆదాయాన్ని సంపాదించుకోవడానికి తాపత్రయ పడుతోంది. దీనికి గాను ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోతో మద్యం ప్రియులకు మింగుడు పడటం లేదు.
Also Read: Bindu Madhavi: ఆ అలవాటు లేదు.. ఉండుంటే, ఓపెన్ గానే చేసేస్తా !
Recommended Videos:
https://www.youtube.com/watch?v=iUtvpRtc5hE&t=11s


[…] Also Read: Telangana Liquor Rates Increased: తెలంగాణలో మద్యం ధరలకు రె… […]