Pavan Benefit From Mega Enthusiasm: ఆంధ్రప్రదేశ్ లో అప్పుడే రాజకీయ వేడి రగులుకుంటోంది. పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ, జనసేన మధ్య వైరుధ్యం ఎక్కువవుతోంది. రాబోయే ఎన్నికల్లో ఇది మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పవన్ కల్యాణ్ జగన్ ను అడుగడుగునా కడిగేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా కుటుంబం మొత్తం ఏకమైపోయినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకే ఓటు వేయాలని తీర్మానించుకున్నట్లు చెబుతున్నారు. దీంతో మెగా అభిమానులకు పండగే కానున్నా రాజకీయాల్లో మాత్రం కొంత దెబ్బ అనే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

పొత్తుల విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. బీజేపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయా? లేదా? అనేది సందేహమే. ఇప్పటికైతే రెండు పార్టీలు కలిసే ఉన్నట్లు సమాచారం. టీడీపీ సైతం పవన్ తో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నా అది సాధ్యం కాదని తేలిపోతోంది. దీంతో టీడీపీ ఒంటరిగానే పోటీకి దిగే అవకాశాలున్నాయి. ఒక వేళ పొత్తు ఉంటే మెగా ఫ్యాన్స్, బాలయ్య అభిమానులు కలిసి నడుస్తారా? అనే సందేహాలు వస్తున్నాయి. దీంతోనే మెగా ఫ్యామిలీ కలవడం పవన్ కు లాభిస్తుందా? లేక నష్టమే తెస్తుందా? అనేది తెలియాల్సి ఉంటుంది.

Also Read: Telangana Liquor Rates Increased: తెలంగాణలో మద్యం ధరలకు రెక్కలు.. మందుబాబులకు చుక్కలు
రాజకీయాలు వేరు సినిమాలు వేరు. సినిమాల్లో హీరోల వెంట ఉంటారు. రాజకీయాల్లో నేతలతో నడుస్తారు. దీంతో ఇక్కడ కులం కూడా ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఫలానా నాయకుడు మా కులం వాడే అంటే ఓట్లేస్తారు. కాదంటే వేయరు. దీంతో రాబోయే ఎన్నికల్లో కులం ప్రభావంతో ఓట్లు పడే అవకాశం లేకపోలేదు. ఇలాగైతే టీడీపీతో పొత్తు ఉంటే రెండు కులాలుగా మారే వీలుంది. దీంతో ఓట్లు వీరికి పడతాయా? లేక చీలిపోతాయా? అనే వాదనలు కూడా వస్తున్నాయి.
మొత్తానికి రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారే సూచనలు కనిపిస్తున్నాయి. జనసేన, టీడీపీ, వైసీపీ తలో దారిలో వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అధికారం కోసం అన్ని పార్టీలు తమ వ్యూహాలు ఖరారు చేస్తున్నాయి. ఇప్పటికే రాజకీయ వేడి రాజేస్తున్నాయి. తమ పార్టీ ప్రచారం కోసం పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ నిర్ణయంతో పవన్ కు మేలు జరుగుతుందో లేదో చూడాల్సిందే.
Also Read: Dil Raju Precautions For F3 Release: ఎఫ్ 3 విడుదలకు దిల్ రాజు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏమిటి?
Recommended Videos:
https://www.youtube.com/watch?v=iUtvpRtc5hE&t=11s


[…] Also Read: Pavan Benefit From Mega Enthusiasm: మెగా ఉత్సాహంతో పవన్ కు మ… […]