Dil Raju Precautions For F3 Release: తెలుగు సినిమా నిర్మాతల్లో అగ్రగణ్యుడు దిల్ రాజు. తనదైన శైలిలో సినిమాలు నిర్మిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. సినిమాల ఎంపిక నుంచి విడుదల వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చిత్ర విజయాలకు బాటలు వేస్తున్నారు. ప్రతి అంశాన్ని పరిశీలించి తమకు అనుకూలంగా మలుచుకోవడమే ఆయన ఆయుధం. అందుకే పరిస్థితులను తనకు కలిసొచ్చేలా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. భారీ చిత్రాల నిర్మాణానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అగ్రహీరోలతో ఔరా అనిపించుకుంటూ చిత్ర విజయాల్లో ప్రధాన భూమిక పోషిస్తున్నారు.

ఇటీవల కాలంలో పెద్ద సినిమాల విషయంలో టికెట్ల ధరలు భారీగా పెంచుకుంటూ లాభాలు సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. పైగా బెనిఫిట్ షోలకు అనుమతులు తీసుకుని సినిమా హిట్ అనిపించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. కానీ దిల్ రాజు మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. టికెట్ల ధరలు పెంచేందుకు కూడా ముందుకు రావడం లేదు. త్వరలో విడుదలయ్యే ఎఫ్3 కోసం రెడీ అవుతున్నా ఇలా టికెట్ల రేట్లు పెంచడానికి మాత్రం ఒప్పుకోవడం లేదు.
ఎంత పెద్ద హీరో సినిమా అయినా టికెట్ల ధరలు పెంచడం మంచి పద్దతి కాదని తెలిసినా ఇప్పుడు అదో ట్రెండ్ గా మారింది. కానీ గతంలో టికెట్ల ధరలు పెంచే సంస్కృతి ఉండేది కాదు. ఎంత పెద్ద సినిమా అయినా కనీసం కలెక్షన్లు తెచ్చేది. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో టికెట్ల ధరలు పెంచడం వద్దని దిల్ రాజు భావిస్తున్నారు. అందుకే ఎఫ్ 3 కి టికెట్ల ధరలు పెంచకుండానే విడుదల చేస్తున్నారు. సాధారణ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: Another Record In Ballayya Name: బాలయ్య పేరిట మరో అరుదైన రికార్డ్.. ఇండియాలోనే నెంబర్ వన్ హీరో..
టికెట్ల పెంపుతో ప్రేక్షకులపై భారం పడుతుందనే ఉద్దేశంతోనే ఈ మేరకు నిర్ణయించినట్లు చెబుతున్నారు. వేసవి కాలంలో సినిమా పెద్ద హిట్ కొట్టాలనే ఆశయంతో దిల్ రాజు బెనిఫిట్ షోలు కూడా వేయడం లేదు. వీటితో సినిమా హిట్టా? ఫట్టా? అనేది తొందరగా తెలియడంతో సినిమా ఓపెనింగ్స్ పై భారీ ప్రభావం చూపుతోంది. అందుకే బెనిఫిట్ షోలకు కూడా నో చెబుతున్నారు. ఇండియాలో అమెరికాలో కూడా ప్రీమియర్ షోలు ఉండటం లేదు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు కనుకే దిల్ రాజు అగ్ర నిర్మాతగా ఎదుగుతున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని నిలబెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.
బెనిఫిట్ షోలతో నెగెటివ్ ప్రభావం ఉంటుందనే ఉద్దేశంతోనే భారత్, విదేశాల్లో సైతం ఒకే సమయానికి షోలు వేసేలా చర్యలు తీసుకున్నారు. గతంలో అగ్రనిర్మాతగా ఉన్న రామానాయుడు మాత్రమే ఇలాంటి నిర్ణయాలు తీసుకునే వారు. ఇప్పుడు దిల్ రాజు అదే కోవలో నడుస్తూ అగ్ర నిర్మాతగా మారినట్లు చెబుతున్నారు.
[…] Also Read: Dil Raju Precautions For F3 Release: ఎఫ్ 3 విడుదలకు దిల్ రాజు … […]
[…] Also Read: Dil Raju Precautions For F3 Release: ఎఫ్ 3 విడుదలకు దిల్ రాజు … […]