https://oktelugu.com/

Aishwarya Rajinikanth: ప్చ్.. అన్ని చోట్ల తీసిపారేసిన ఐశ్వర్య రజనీకాంత్‌ !

Aishwarya Rajinikanth: తమిళ హీరో ధనుష్‌, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కూతురు ఐశ్వర్య దంపతులు విడిపోయి నెలలు గడుస్తున్నాయి. ఇప్పటికే, రజినీకాంత్ కూడా వీరి విడాకుల విషయంలో చాలా బాధ పడ్డాడు. కనీసం రజిని బాధను చూడలేక అయినా.. ధనుష్‌, ఐశ్వర్య దంపతులు మళ్లీ కలిసిపోతారని ఇన్నాళ్లు అందరూ భావించారు. కానీ.. ప్రస్తుతం వీరి మధ్య నెలకొన్న పరిస్థితులు చూస్తే.. ఇక అలా భావించడం వృధానే అని తేలిపోయింది. తన నిర్ణయం లో ఎలాంటి మార్పు లేదని […]

Written By:
  • Shiva
  • , Updated On : March 26, 2022 / 06:44 PM IST
    Follow us on

    Aishwarya Rajinikanth: తమిళ హీరో ధనుష్‌, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కూతురు ఐశ్వర్య దంపతులు విడిపోయి నెలలు గడుస్తున్నాయి. ఇప్పటికే, రజినీకాంత్ కూడా వీరి విడాకుల విషయంలో చాలా బాధ పడ్డాడు. కనీసం రజిని బాధను చూడలేక అయినా.. ధనుష్‌, ఐశ్వర్య దంపతులు మళ్లీ కలిసిపోతారని ఇన్నాళ్లు అందరూ భావించారు. కానీ.. ప్రస్తుతం వీరి మధ్య నెలకొన్న పరిస్థితులు చూస్తే.. ఇక అలా భావించడం వృధానే అని తేలిపోయింది.

    Dhanush, Aishwarya

    తన నిర్ణయం లో ఎలాంటి మార్పు లేదని ఐశ్వర్య ఇన్ డైరెక్ట్ గా చాలా బలంగా చెబుతూ వస్తోంది. నిజానికి రజినీకాంత్ ఇద్దరినీ కలిపేందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా..
    ఐశ్వర్య మాత్రం అసలు కాంప్రమైజ్ కావడం లేదు. ఓ దశలో ధనుష్ సైతం ఐశ్వర్యకి సారీ చెప్పి.. మళ్లీ ఒక్కటి అవుదాం అని రిక్వెస్ట్ చేశాడట. కానీ.. ఐశ్వర్య మాత్రం ఇక తనకు ఆ ఆలోచన లేదు అని ఫుల్ క్లారిటీ ఇచ్చింది.

    Also Read: CM KCR- Governor Tamilisai: కేసీఆర్ ను మళ్లీ డిఫెన్స్ లో పడేసిన గవర్నర్

    మనది ఇక నుంచి ఎవరి దారి వారిదే అని ధనుష్ మొహం మీదే ఐశ్వర్య చెప్పింది. పైగా ఐశ్వర్య అంతటితో ఆగలేదు. తన సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి ధనుష్ పేరుని
    మొత్తంగా తొలగించి షాక్ ఇచ్చింది. మొదట ఐశ్వర్య మార్చి 21న ట్విట్టర్ లో తన పేరులో నుంచి ధనుష్ పేరును తీసేసింది. ఆ తర్వాత మార్చి 24న ఇన్ స్టాగ్రామ్ లో కూడా ధనుష్ పేరును తీసేసింది. ఇప్పుడు అన్ని చోట్లా ఆమె తన పేరుని ఐశ్వర్య రజినీకాంత్ అని మారుస్తోంది.

    ప్రస్తుతం ఐశ్వర్య ఒక సినిమాకి డైరెక్షన్ చేస్తోంది. కాగా ఈ సినిమా టైటిల్స్ లో కూడా ఆమె తన పేరును ఐశ్వర్య రజినీకాంత్ గానే వేసుకుంది. ఇదంతా చూసిన సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు.. ధనుష్, ఐశ్వర్య మళ్ళీ కలిసిపోతారనే భ్రమలు తొలిగించుకుంటున్నారు. ధనుష్ విషయంలో ఐశ్వర్య అసలు కాంప్రమైజ్ కావడం లేదు అని.. ఇక కూతురు ఇష్టప్రకారం తీసుకున్న నిర్ణయానికే రజినీకాంత్ కూడా కట్టుబట్టాడట.

    అందుకే, రజినీకాంత్ కూడా ఈ విడాకుల మేటర్ ని వదిలేశాడట. ధనుష్‌తో ఐశ్వర్యకు 2004 నవంబర్‌ 18న వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మధ్య వీరి మధ్యలోకి వేరే వ్యక్తులు వచ్చారని.. ధనుష్ వేరే హీరోయిన్ తో సన్నిహితంగా ఉండటం ఐశ్వర్యకి నచ్చలేదని అందుకే అప్పటి నుంచి ఆమె ధనుష్ కి దూరంగా ఉంటుందని తెలుస్తోంది.

    Also Read: Allu Arjun Congratulated RRR Team: వైరల్ : ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కి అల్లు అర్జున్ కంగ్రాచ్యులేషన్స్

    Tags