S. V. Krishna Reddy: సినిమాకి దర్శకుడు తండ్రి లాంటి వాడు. అందుకే, ఎన్టీఆర్ ఏఎన్నార్ లాంటి మహానటులు కూడా దర్శకుడికి ఎంతో గౌరవం ఇచ్చేవారు. అయితే, దర్శకులలో ఎందరో మంచి దర్శకులు తమదైన ముద్ర వేసుకుని తెలుగు వెండితెరపై తిరులేని గొప్ప చిత్రాలను అందించి వెళ్లారు. అయితే, అయ్యో ఈ దర్శకుడు ఇంకొన్ని సినిమాలు తీసుంటే ఎంతో బాగుండేది కదా అని కొందరి విషయంలో అనిపిస్తుంది.

అలా అనిపించే దర్శకుల లిస్ట్ లో ఉండవలసిన పేరు ‘ఎస్. వి. కృష్ణ రెడ్డి గారిది’. నిన్నటి తరంలో ఇంటిల్లిపాది ఆహ్లాదకరంగా చూడగలిగే చక్కని సినిమాలు తీశాడు ఆయన. అందుకే ఆయన సినిమాలకు 1990 లలో ప్రత్యేక అభిమానులు ఉండేవారు. పైగా ఆ రోజుల్లో కిడ్స్ అంతా ఆయన సినిమాలను ఎంతగానో ఇష్టపడేవారు.
Also Read: ప్చ్.. దర్శకులూ ఇప్పటికైనా ఆలోచించండయ్యా !
ఒక విధంగా ఆయనకు ఫ్యామిలీ అభిమానులు ఎక్కువ. తన అభిమానులను దృష్టిలో పెట్టుకునే కృష్ణ రెడ్డి సినిమాలు చేసేవారు. నిజానికి ఆయన అసలు దర్శకుడు అవుదాం అని ఇండస్ట్రీకి రాలేదు. హీరో అవ్వాలని ఆశ పడ్డారు. కృష్ణ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లోని ఈస్ట్ గోదావరి జిల్లాలో 1 జూన్ 1961 లో జన్మించారు. చిన్న తనం నుంచే మంచి కళాపోషకుడు.

సినిమా పై మక్కువ. ముఖ్యంగా నటన పై ఎంతో ఆసక్తి. అయితే, విధి ప్రభావమో లేక, మరో కారణమో తెలియదు గానీ, కృష్ణ రెడ్డి డైరెక్టర్ గా సినీ రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. ఆయన మొదటి చిత్రం ‘మాయలోడు’. ఆ సినిమాకు ఆయన డైరెక్టర్ మాత్రమే కాదు, యాక్టర్, ప్రొడ్యూసర్, స్క్రీన్ రైటర్ మరియు కంపోజర్ కూడా.
Also Read: యమలీల’లో మొదట హీరో మహేష్ బాబు అట !
ఇన్నీ చేసినా ఆయన ఆ సినిమాతో సూపర్ సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత ఆయన చేసిన ‘యమలీల, శుభలగ్నం, రాజేంద్రుడు గజేంద్రుడు, మావిచిగురు, పెళ్ళాం వూరెలితే’ లాంటి సినిమాలు అద్భుత విజయాలు సాధించాయి. ఎస్.వి. కృష్ణారెడ్డి గారు చాలా సింపుల్ గా ఉంటారు. ఆయన నిగర్వి. పైగా చాలా మంచి వ్యక్తి. సినిమా పై గౌరవం ఉన్న వ్యక్తి. మరి అలాంటి ఆయన నిజంగానే ఇంకా ఎక్కువ సినిమాలు చేసి ఉంటే చాలా బాగుండేది.