Telangana Schools: తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ క్రమంలోనే పాఠశాలల నివేళల్లో మొన్న మార్పు చేసింది ప్రభుత్వం. మార్చి 31 నుంచి ఈ షెడ్యూల్ అందుబాటులోకి వచ్చింది. 31నుంచి ఏప్రిల్ 6వ తేదీ దాకా ఉదయం 8 గంటల నుండి 11.30 గంటల దాకానే స్కూళ్లను నిర్వహించింది ప్రభుత్వం.
కాగా ఈ స్కూల్ టైమింగ్స్ లో మరోసారి మార్పులు చేసింది ప్రభుత్వం. వీటిని మారుస్తూ ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల దాకా పాఠశాలలు నిర్వహించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. గత నెల 15 నుండే ఒంటిపూట బడులు నడుస్తున్నాయి.
Also Read: MLA Roja: జిల్లాల పునర్విభజన రోజాకు మేలు చేయనుందా?
ఈ ఒంటిపూట బడుల సమయంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల దాకా బడులు నడిచేవి. కానీ మార్చి మార్చి చివరి వారంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ఒక ఒక గంట సమయాన్ని కుదించి 11.30గంటల దాకానే నిర్వహించాలని సూచించింది ప్రభుత్వం. ఇది విద్యార్థులకు కొంత మేలు చేకూర్చుతుందని చెప్పారు అధికారులు.
ఈ షెడ్యూల్ ఏప్రిల్ 6వరకు అమలులో ఉంది. కాగా ఈరోజు నుంచి మార్చి7నుంచే కుదించిన సమయాన్ని పెంచుతూ మళ్లీ పాత షెడ్యూల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నెల 16వ తేదీ నుంచి 22 దాకా ఒకటో తరగతి నుండి 9వ తరగతి దాకా ఇయర్లీ ఎగ్జామ్స్ జరుగుతాయి. 23న రిజల్ట్స్ వస్తాయి. మే 23 నుంచి జూన్ 1వ తేదీ దాకా టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. అయితే ముందుగా మే 11 నుంచి మే 20 దాకా నిర్వహించలని అధికారులు భావించారు. కానీ ఇందులో మార్పులు చేసింది రాష్ట్ర విద్యాశాఖ.
Also Read:Revanth Reddy House Arrest: కదం తొక్కిన కాంగ్రెస్ దండు.. రేవంత్ సహా కాంగ్రెస్ నేతల అరెస్ట్