https://oktelugu.com/

MLA Roja: జిల్లాల పునర్విభజన రోజాకు మేలు చేయనుందా?

MLA Roja: మంత్రివర్గ విస్తరణపై అందరిలో ఆశలు నెలకొన్నాయి. తమకు పదవి కచ్చితంగా వస్తుందనే ధీమాలో చాలా మంది ఉన్నారు. దీంతో వారు పదవి ఖాయమనే ఆలోచనలో ఊగిసలాడుతున్నారు. కానీ ఇంతవరకు జగన్ మదిలో ఎవరున్నారో అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో మంత్రిపదవి అందరిని ఊరిస్తోంది. ఇన్నాళ్లుగా మంత్రివర్గ విస్తరణపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆశావహులు ఆనందడోలికల్లో తేలియాడుతున్నారు. మంత్రి పదవి వరిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. మంత్రివర్గంలోని వారందరిని రాజీనామా చేయిస్తుండటంతో కొత్తవారికి పదవి వస్తుందనే […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 7, 2022 / 03:19 PM IST
    Follow us on

    MLA Roja: మంత్రివర్గ విస్తరణపై అందరిలో ఆశలు నెలకొన్నాయి. తమకు పదవి కచ్చితంగా వస్తుందనే ధీమాలో చాలా మంది ఉన్నారు. దీంతో వారు పదవి ఖాయమనే ఆలోచనలో ఊగిసలాడుతున్నారు. కానీ ఇంతవరకు జగన్ మదిలో ఎవరున్నారో అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో మంత్రిపదవి అందరిని ఊరిస్తోంది. ఇన్నాళ్లుగా మంత్రివర్గ విస్తరణపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆశావహులు ఆనందడోలికల్లో తేలియాడుతున్నారు. మంత్రి పదవి వరిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. మంత్రివర్గంలోని వారందరిని రాజీనామా చేయిస్తుండటంతో కొత్తవారికి పదవి వస్తుందనే అనుకుంటున్నారు.

    MLA Roja

    వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాను కూడా మంత్రి పదవి ఊరిస్తోంది. గతంలోనే పదవి వస్తుందని ఆశించినా అక్కడి సామాజిక సమీకరణల నేపథ్యంలో ఆమెకు పదవి దరిచేరలేదు. అయినా ఆమె నిరాశ చెందలేదు. మలివిడతలో పదవి ఖాయంగా వస్తుందనే ఆశతోనే ఉన్నారు. దీంతో ఈసారి మాత్రం మంత్రి పదవి సాధ్యమనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే సమీకరణలు ఆమెకు అనుకూలంగా ఉన్నాయి.

    Also Read: BP Sugar in Telangana: తెలంగాణ ప్రజలకు బీపీ, షుగర్ పెరగడానికి కారణాలేంటి?

    నగరి నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలు తిరుపతిలో మరికొన్ని ప్రాంతాలు చిత్తూరులో ఉండటంతో రెండు జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రోజాకు మంత్రి పదవి వస్తుందనే ఉద్దేశంతోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రం రోజా శుభవార్త వినే అవకాశముంది. దీంతో ఆమె ఆలోచనలు కార్యరూపం దాల్చే సమయమొచ్చింది. చిత్తూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామికి మంత్రి పదవులు దక్కడంతో రోజాకు ఇవ్వడం కుదరలేదు.

    MLA Roja

    ప్రస్తుతం రోజాకు పదవి ఖాయమనే సంకేతాలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె ఉత్సాహంతో ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. సామూహిక సీమంతాలు నిర్వహిస్తున్నారు. మంత్రి పదవి వస్తుందనే ఆశతోనే ఆమెలో ఆనందం వెల్లివిరుస్తోంది. భవిష్యత్ లో పార్టీని బలోపేతం చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇన్నాళ్లకు రోజా కోరిక తీరే అవకాశాలు రావడం నిజంగా ఆమెకు శుభపరిణామమే.

    Also Read:Real estate: ‘మైహోం’ను అధిగమించి.. రియల్ ఎస్టేట్ రంగంలో ‘జీఏఆర్ గ్రూప్’ ఎలా నంబర్ 1గా ఎదిగింది?

    Tags