ప్రజలకు శుభవార్త.. టీఎస్ బీపాస్‌లో కీలక మార్పులు?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయడం కోసం కొన్ని నెలల క్రితం టీఎస్ బీపాస్‌ విధానాన్ని అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు ఈ విధానం ద్వారా రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయనున్నాయి. 2020 సంవత్సరం నవంబర్ నెల 16వ తేదీన పట్టణ ప్రాంతాలలో నిర్మాణ అనుమతులను సులభతరం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ సర్కార్ ఈ విధానాన్ని అమలులోకి తెచ్చింది. ప్రభుత్వం ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలనే […]

Written By: Navya, Updated On : April 5, 2021 10:18 am
Follow us on

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయడం కోసం కొన్ని నెలల క్రితం టీఎస్ బీపాస్‌ విధానాన్ని అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు ఈ విధానం ద్వారా రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయనున్నాయి. 2020 సంవత్సరం నవంబర్ నెల 16వ తేదీన పట్టణ ప్రాంతాలలో నిర్మాణ అనుమతులను సులభతరం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ సర్కార్ ఈ విధానాన్ని అమలులోకి తెచ్చింది.

ప్రభుత్వం ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో టీఎస్ బీపాస్ విధానంలో కీలక మార్పులు చేసి ప్రజలకు మరిన్ని వెసులుబాట్లను కల్పించింది. గతంలో టీఎస్ బీపాస్ విధానం ద్వారా భవన నిర్మాణ అనుమతికి ఒక వ్యక్తి మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. ప్రభుత్వం ప్రస్తుతం ఇద్దరు అంతకంటే ఎక్కువమంది వ్యక్తులు ఈ విధానం ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తుండటం గమనార్హం.

అధికారులు టీఎస్ బీపాస్ వెబ్ సైట్ లో అదనపు అంతస్తులు అదనపు గదుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఏర్పాట్లు చేయడం గమనార్హం. ఏదైనా కారణం వల్ల భవన నిర్మాణానికి అనుమతులు మంజూరు కాకపోతే అధికారులు టీఎస్ బీపాస్ ఛార్జీలను మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఖాతాలో జమ చేయనున్నారు. అధికారులు టీఎస్ బీపాస్ సహాయ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి దరఖాస్తుదారుల సమస్యలను పరిష్కరించనున్నారు.

టీఎస్ బీపాస్ విధానం అమలులోకి వచ్చిన తరువాత ఇప్పటివరకు 15,700 కంటే ఎక్కువ నిర్మాణాలకు అనుమతులు మంజూరైనట్లు తెలుస్తోంది. ఈ విధానం ద్వారా భవనాల నిర్మాణాలను 21 రోజుల్లోగా అనుమతులు మంజూరవుతున్నాయి. అధికారులు ఈ విధానంలో నిర్దేశించిన గడువులోగా అనుమతులు, ధ్రువపత్రాలను జారీ చేయనున్నారని తెలుస్తోంది.