https://oktelugu.com/

అలా ఒక్క పవన్ మాత్రమే చెప్పగలడు !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గొప్పది అని.. అలాగే ఆయన సేవాగుణం అంతకు మించిన గొప్పతనం అని, అదేవిధంగా ఆయన ఆలోచనా విధానం ఎంతో ప్రత్యేకమైనది అని ఇలా.. పవన్ గురించి తెలిసిన వాళ్ళు ఆయన గురించి ఎంతో గొప్పగా చెబుతుంటారు. అసలు పవన్ కున్న స్టార్ డమ్ ముందు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎంత ? పైగా గతంలో టీవీలకు ఎక్కి మరీ తనను తిట్టిన ఓ నటుడి గురించి గొప్పగా ఎవరైనా చెబుతారా […]

Written By: , Updated On : April 5, 2021 / 10:12 AM IST
Follow us on

Pawan Speech
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గొప్పది అని.. అలాగే ఆయన సేవాగుణం అంతకు మించిన గొప్పతనం అని, అదేవిధంగా ఆయన ఆలోచనా విధానం ఎంతో ప్రత్యేకమైనది అని ఇలా.. పవన్ గురించి తెలిసిన వాళ్ళు ఆయన గురించి ఎంతో గొప్పగా చెబుతుంటారు. అసలు పవన్ కున్న స్టార్ డమ్ ముందు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎంత ? పైగా గతంలో టీవీలకు ఎక్కి మరీ తనను తిట్టిన ఓ నటుడి గురించి గొప్పగా ఎవరైనా చెబుతారా ? ఒక్క పవన్ మాత్రమే చెబుతారేమో. అందుకే ఆయన పవర్ స్టార్ అయింది.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వకీల్‌ సాబ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. అయితే, ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా పవన్, ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడుతూ.. ప్రకాష్ రాజ్ గారు గొప్ప నటుడు. రాజకీయంగా మేము వేరు కావొచ్చు. అలాగే ఆయన నన్ను టీవీల్లో కూర్చుని నన్ను తిట్లు తిట్టి ఉండొచ్చు. కానీ ఒక నటుడిగా నేను ఆయనను ఎప్పుడూ గౌరవిస్తాను. ఈ సినిమాలో ప్రతివాద లాయర్‌గా ప్రకాశరాజ్ నటించడం మరింత వన్నెను చేకూర్చింది.

నా పర్పార్మెన్స్ ఈ సినిమాలో బాగుందంటే అందుకు కారణం ప్రకాశ్‌రాజ్ గారే‌ అంటూ పవన్ చెప్పడం నిజంగా పవన్ గొప్పదనానికి నిదర్శనం. ఇక అన్ని సినిమాల కంటే ఈ సినిమాలో నేను కాస్త ఎక్కువగానే కష్టపడ్డాను అని పవన్ చెప్పారు. అలాగే పవన్ వకీల్ సాబ్ గురించి మాట్లాడుతూ.. అందరం మా ప్రేమంతా ధారపోసిన ఈ సినిమా జనాల గుండెల్లోకి వెళ్తుందనే నమ్మకం నాకు ఉంది’’ అని పవన్ కళ్యాణ్ అన్నారు. అయినా అవసరంలో ఉన్నవారికి అడగకుండానే సాయం చేసే పవన్, ఇక తన మనుషులు కాదు అని అనుకున్నవాళ్లను కూడా ఇంతలా గౌరవించడం అనేది ఒక్క పవన్ లోనే చూస్తాం అంటూ నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.