https://oktelugu.com/

టీఆర్‌‌ఎస్‌కు ఎదురు గాలి

గ్రేటర్‌‌ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా నిలిచినా… ఎదరు గాలి వీస్తోందనేదనేది మాత్రం అంగీకరించక తప్పదు. అది కూడా బీజేపీ రూపంలో రావడం గులాబీ దళానికి ఆందోళన కలిగిస్తోంది. కాంగ్రెస్‌ను ఖాళీ చేస్తే తనకు ఉండదనుకున్న కేసీఆర్‌‌.. కమలదళాన్ని తక్కువగా అంచనా వేశారు. ప్రజావ్యతిరేకతను క్యాష్‌ చేసుకున్న కమలనాథులు టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నామని నిరూపించారు. Also Read: టీపీసీసీ చీఫ్.. చిచ్చుపెడుతున్న కాంగ్రెస్ సీనియర్లు టీఆర్‌‌ఎస్‌తో సమానంగా బీజేపీకి ఓటు షేర్ గ్రేటర్‌‌ […]

Written By: Srinivas, Updated On : December 6, 2020 11:14 am
Follow us on


గ్రేటర్‌‌ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా నిలిచినా… ఎదరు గాలి వీస్తోందనేదనేది మాత్రం అంగీకరించక తప్పదు. అది కూడా బీజేపీ రూపంలో రావడం గులాబీ దళానికి ఆందోళన కలిగిస్తోంది. కాంగ్రెస్‌ను ఖాళీ చేస్తే తనకు ఉండదనుకున్న కేసీఆర్‌‌.. కమలదళాన్ని తక్కువగా అంచనా వేశారు. ప్రజావ్యతిరేకతను క్యాష్‌ చేసుకున్న కమలనాథులు టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నామని నిరూపించారు.

Also Read: టీపీసీసీ చీఫ్.. చిచ్చుపెడుతున్న కాంగ్రెస్ సీనియర్లు

టీఆర్‌‌ఎస్‌తో సమానంగా బీజేపీకి ఓటు షేర్

గ్రేటర్‌‌ ఎన్నికల్లో బీజేపీ ఎంఐఎంను దాటుకొని రెండో స్థానానికి చేరడమే కాదు.. దాదాపు టీఆర్‌‌ఎస్‌తో సమానంగా ఓటు షేర్‌‌ సాధించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకోవడం విశేషం. అంటే అక్కడ ప్రజా వ్యతిరేకతను సక్సెస్‌ ఫుల్‌గా క్యాష్‌ చేసుకోగలిగింది. గత ఎన్నికల్లలో కేవలం 4 స్థానాల్లో గెలుపొంది పార్టీ ఈ సారి 48 డివిజన్లు కైవసరం చేసుకోవడం భారీ విజయమే

గేమ్‌ ఛేంజ్‌ అవుతుందా..!

తెలంగాణ గేమ్‌ ఛేంజ్‌ అవతున్నట్లు కనిపిస్తోంది. గత ఆరేళ్లుగా ఏకపక్షంగా సాగుతున్న ఆటకు.. బీజేపీ చెక్‌ పెడుతోంది. అంగ, అర్థ,రాజకీయ బలంతో టీడీపీ, వైసీపీ , కాంగ్రెస్‌లను బలహీన పరిచిన కేసీఆర్‌‌ను ఆ పార్టీ ధీటుగా ఎదుర్కొంటోంది. దుబ్బాక, గ్రేటర్‌‌ ఫలితాలతో తన ప్రాబల్యాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించుకోవడానికి ప్లాట్‌ఫాం రెడీ చేసుకుంటోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏదంటే టీఆర్ఎస్ ఓట్ షేర్ నలభై శాతం లోపుగానే ఉన్నది.. ప్రతిపక్షాల ఉమ్మడి ఓట్ షేర్ 60 శాతం దాటింది.

Also Read: రజినీకాంత్ రాజకీయ ప్రవేశం.. 25 ఏళ్ల నిరీక్షణ

కీలక నేతల ప్రభావం తక్కువే…

ఇన్నాళ్లు ఏ ఎన్నిక అప్పజెప్పినా గెలుపించుకొని వచ్చే సత్తా టీఆర్‌‌ఎస్‌ కీలక నేతలది. కానీ, ఈ సారి వారి ప్రభావమే కనిపించలేదు. దుబ్బాకను హరీశ్‌రావు చాలెంజ్‌గా తీసుకున్నా.. పార్టీ ఓడిపోయింది. గత గ్రేటర్ ఎన్నికల్లో అన్ని తానై నడిపించిన కేటీఆర్‌‌ 99 సీట్లు గెలిపించుకోగలిగాడు. ఈ సారి మాత్రం 55 వద్దే ఆగిపోయాడు. ఎమ్మెల్సీ కవిత, కీలక మంత్రులు ఇన్‌చార్జిలుగా ఉన్న డివిజన్లు కూడా పరాజయం పాలయ్యారు. మొత్తానికి కేసీఆర్‌‌ పాలనపై జనాలు ఆగ్రహంతో ఉన్నారన్నది మాత్రం జనం.. తీరు మార్చుకోకపోతే ఎదుగాలి మరితం ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్