వాహనదారులకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన పెట్రోల్ ధరలు..?

కరోనా విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల నేపథ్యంలో దేశంలోని ప్రజలు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కు నెమ్మదిగా దూరమవుతున్న సంగతి తెలిసిందే. ప్రజల్లో చాలామంది సొంత వాహనాలపైనే ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొత్త వాహనాలను కొనుగోలు చేయలేని వాళ్లు సెకండ్ హ్యాండ్ బైక్ లు, సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే సొంత వాహనాలు వాడేవాళ్లకు పెట్రోల్, డీజిల్ ధరలు షాకిస్తున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ ధర ఏకంగా రెండేళ్ల గరిష్టానికి […]

Written By: Navya, Updated On : December 6, 2020 11:28 am
Follow us on


కరోనా విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల నేపథ్యంలో దేశంలోని ప్రజలు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కు నెమ్మదిగా దూరమవుతున్న సంగతి తెలిసిందే. ప్రజల్లో చాలామంది సొంత వాహనాలపైనే ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొత్త వాహనాలను కొనుగోలు చేయలేని వాళ్లు సెకండ్ హ్యాండ్ బైక్ లు, సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే సొంత వాహనాలు వాడేవాళ్లకు పెట్రోల్, డీజిల్ ధరలు షాకిస్తున్నాయి.

దేశంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ ధర ఏకంగా రెండేళ్ల గరిష్టానికి చేరింది. గడిచిన ఐదు రోజులుగా పెట్రోల్ ధర అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ఈరోజు పెట్రోల్ ధర 29 పైసలు పెరగడంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 86.75 రూపాయలకు చేరగా డీజిల్ ధర 32 పైసలు పెరిగి 80.32 రూపాయలకు చేరింది. పెట్రోల్, డీజిల్ ధరల మధ్య వ్యత్యాసం కేవలం ఆరు రూపాయలు మాత్రమే కావడం గమనార్హం.

తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ విధిస్తున్న అదనపు పన్నుల కారణంగా విజయవాడలో పెట్రోల్ ధర 89.14 రూపాయలుగా ఉండగా డీజిల్ ధర 82.27 రూపాయలుగా ఉంది. పెట్రోల్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటంతో వాహనదారులపై అదనపు భారం పడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గేలా చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 82.71 రూపాయలుగా ఉండగా పెట్రోల్ ధర రెండేళ్ల గరిష్ట స్థాయి కావడం గమనార్హం.

పెట్రోల్, డీజిల్ లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల భారాన్ని తగ్గించి ప్రయోజనం చేకూరేలా చేయాలని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.