Singareni Collieries: సింగరేణి బ్లాకులను ప్రైవేటీకరించాలనే కేంద్రం ఉద్దేశాల్ని నిరసిస్తూ కార్మికులు చేపట్టిన సమ్మె విజయవంతమైంది. ఈ మేరకు కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి సీఎం కేసీఆర్ కూడా మద్దతు పలికారు. కేంద్రానికి లేఖ కూడా రాశారు. ప్రైవేటీకరణ ప్రయత్నాలను విరమించుకోవాలని చెబుతున్నారు. కార్మికుల పొట్ట కొట్టే పనులు వద్దని హితవు పలికారు.

దాదాపు ఐదు స్టేట్ల థర్మల్ అవసరాలు తీర్చే బొగ్గు గనులను ప్రైవేటీకరించాలని కేంద్రం భావించడం తగదు. రాష్ర్ట విభజన తరువాత బొగ్గు వినియోగం రెట్టింపయింది. దీంతో సింగరేణి నుంచే బొగ్గు వస్తున్నందున కేంద్రం మరోసారి పునరాలోచించుకోవాలని చెబుతున్నారు. బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేస్తే కార్మికులకు ఉపాధి లేకుండా పోతుందని వాపోతున్నారు.
కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ వేలం వేయాలని చూస్తున్న వైనంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బొగ్గు గనులను సింగరేణికే కేటాయించేలా చూడాలని కోరుతున్నారు. కేంద్రం నిర్ణయంతో కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం సరికాదనే వాదనలు వెల్లువెత్తుతున్నాయి. సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులు సమ్మె పాటించాయి. కార్మికులెవరు విధులకు హాజరు కాలేదు.
Also Read: Khammam TRS: మరికొన్ని గంటలే… ఖమ్మం టీఆర్ఎస్‌లో తెలియని భయం.. కారణమేంటి?
సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు మద్దతు పలికాయి. నాలుగు బ్లాకులను వేలం వేయాలని చూడటం తగదని చెబుతున్నారు. కోల్ ఇండియాలోని 89 బ్లాకులతో పాటు సింగరేణిలోని నాలుగు బ్లాకులను వేలం వేయాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయం సహేతుకంగా లేదన్నారు. కేంద్రం అన్నింటిని ప్రైవేటీకరణ చేస్తూ కార్మికులను రోడ్డున పడేసేలా చేస్తుందని వాపోయారు. కేంద్రం నిర్ణయం పున: సమీక్షించుకుని ప్రైవేటీకరణ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు.
Also Read: KCR vs BJP: కేసీఆర్ కు చెక్ పెట్టే బీజేపీ వ్యూహం: కీలక నేతలను ఢిల్లీకి పిలిచిన అమిత్ షా