https://oktelugu.com/

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు.. కీలక బిల్లులకు ఆమోదం..!

ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరిగాయి. అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలయుద్ధం కొనసాగాయి. ఈ సమావేశాల్లోనే కేసీఆర్ ప్రభుత్వం కొత్త రెవిన్యూ యాక్ట్ తీసుకొచ్చి ఆమోదింపజేసింది. అదేవిధంగా ఎల్ఆర్ఎస్ క్రమబద్దీకరణకు మరోసారి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే రైతుల పంట పొలాల్లో మీటర్లు అమర్చాలని కేంద్రం తీసుకొచ్చిన బిల్లుపై చర్చ జరిగింది. ఈ బిల్లుకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ తీర్మానం చేసిన సంగతి తెల్సిందే. Also Read: నంబర్ 1 చానెల్ నుంచి […]

Written By:
  • NARESH
  • , Updated On : October 13, 2020 / 03:06 PM IST
    Follow us on

    ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరిగాయి. అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలయుద్ధం కొనసాగాయి. ఈ సమావేశాల్లోనే కేసీఆర్ ప్రభుత్వం కొత్త రెవిన్యూ యాక్ట్ తీసుకొచ్చి ఆమోదింపజేసింది. అదేవిధంగా ఎల్ఆర్ఎస్ క్రమబద్దీకరణకు మరోసారి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే రైతుల పంట పొలాల్లో మీటర్లు అమర్చాలని కేంద్రం తీసుకొచ్చిన బిల్లుపై చర్చ జరిగింది. ఈ బిల్లుకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ తీర్మానం చేసిన సంగతి తెల్సిందే.

    Also Read: నంబర్ 1 చానెల్ నుంచి వైదొలిగిన ప్రముఖ జర్నలిస్టు? కారణమేంటి?

    అయితే కరోనా కరోనా వర్షాకాల అసెంబ్లీ సమావేశాలను అనుకున్న సమయం కంటే ముందుగానే వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే ప్రభుత్వం అసెంబ్లీ మాత్రం ప్రొరోగ్ చేయలేదు. దీనివల్ల ప్రభుత్వం ఎప్పుడంటే అప్పుడు మళ్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించుకునే అవకాశం ఉంటుందని తెల్సిందే. ఈ నేపథ్యంలో తాజాగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది.

    ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు కేవలం ప్రత్యేక బిల్లలును ఆమోదించుకునేందుకే నిర్వహిస్తున్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు.  గ్రేటర్ హైదరాబాద్ మున్సిప్ కార్పొరేషన్ సలహా నాలుగు చట్టాల సవరణకు అసెంబ్లీలో బిల్లులను మంత్రి కేటీఆర్.. ఇంద్రకరణ్ రెడ్డి.. ప్రశాంత్ రెడ్డి ప్రవేశపెట్టారు.

    సభ ప్రారంభం కాగానే భూముల ధర నిర్ధారణకు సంబంధించిన సబ్ రిజిస్ట్రార్ కు 47ఏ కింద ఉన్న విచక్షణాధికారాలను రద్దు చేస్తూ ఇండియన్ స్టాంప్ చట్టానికి సవరణ చేశారు. ఇందులో భాగంగా వ్యవసాయ భూములను వ్యవసాయేతరాలుగా బదలాయించే ప్ర్రక్రియలో అధికారులకు విచక్షణాధికారులు లేకుండా ధరణి ద్వారా ఆన్ లైన్ ధరఖాస్తు చేసుకోవాలని చట్టసవరణ బిల్లు అసెంబ్లీలో ప్రశపెట్టారు.

    Also Read: రైతుల మెడకు మీటర్లు.. జగన్ కు లాభమా? నష్టమా?

    అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్ట సవరణబిల్లు.. కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసిజర్ చట్టసవరణ బిల్లులను అసెంబ్లీలో మంత్రులు ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఈ బిల్లులపై అధికార.. ప్రతిపక్షాల మధ్య వాడీవేడి చర్చ నడుస్తోంది. అసెంబ్లీ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉండటంతో ఈ నాలుగు చట్టసవరణ బిల్లుకు సులువుగా ఆమోదంపొందే అవకాశం కన్పిస్తోంది.