https://oktelugu.com/

రైతు కన్నెర్ర చేస్తే.. ప్రభుత్వాలకు ఏ గతిపడుతుంది?

రైతు కన్నెర్ర చేస్తే.. ప్రభుత్వాలకు ఏ గతిపడుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు బ్రతికిబట్టకట్టినట్లు లేవు. అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులను టార్గెట్ చేస్తూ పోతున్నారు. అమరావతి రాజధాని విషయంలో అక్కడి రైతులను వైసీపీ సర్కార్ ఎన్ని ఇబ్బందులు పెట్టిందో ప్రతీఒక్కరు చూసే ఉంటారు. ఈ సమస్య ఇంకా ఏపీలో ఇంకా రావణకాష్టంలా మండుతూనే ఉంది. Also Read: రైతుల మెడకు మీటర్లు.. […]

Written By:
  • NARESH
  • , Updated On : October 13, 2020 / 03:12 PM IST
    Follow us on

    రైతు కన్నెర్ర చేస్తే.. ప్రభుత్వాలకు ఏ గతిపడుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు బ్రతికిబట్టకట్టినట్లు లేవు. అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులను టార్గెట్ చేస్తూ పోతున్నారు. అమరావతి రాజధాని విషయంలో అక్కడి రైతులను వైసీపీ సర్కార్ ఎన్ని ఇబ్బందులు పెట్టిందో ప్రతీఒక్కరు చూసే ఉంటారు. ఈ సమస్య ఇంకా ఏపీలో ఇంకా రావణకాష్టంలా మండుతూనే ఉంది.

    Also Read: రైతుల మెడకు మీటర్లు.. జగన్ కు లాభమా? నష్టమా?

    ఇదిలా ఉండగానే.. తాజాగా ఏపీలోని రైతులందరికీ ఇబ్బందులు తెచ్చే ఓ కొత్త పథకానికి జగన్ సర్కార్ శ్రీకారం చుడుతుండటం గమనార్హం. ఏపీ ప్రభుత్వం కొత్తగా వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించే కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధపడుతోంది. కేంద్రం నుంచి జగన్ సర్కార్ 4వేల కోట్లు రూపాయాలు తీసుకొని రైతులపై మీటర్ల భారం మోపుతుందని ప్రచారం జనాల్లోకి బలంగా వెళ్లింది. ప్రతిపక్షాలు సైతం రైతుల పొలాల్లో మీటర్లు బిగిస్తే బద్దలు కొడుతామంటూ హెచ్చరిస్తున్నారు.

    దీంతో ఈ పథకాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే టెన్షన్ ప్రభుత్వ యంత్రాంగంలో మొదలైంది. కేంద్రం షరతులకు ఇప్పటికే ఆమోదం తెలిపిన జగన్ సర్కార్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పథకాన్ని వెనక్కి తీసుకునే అవకాశం లేదని తెలుస్తోంది. ఈపాటికే కేంద్రం నుంచి రావాల్సిన నిధులను జగన్ సర్కార్ వాడుకుందని సమాచారం. మీటర్లను బిగించడం వల్ల రైతులకు నాణ్యమైన కరెంట్ అందుతుందని.. ఉదయంపూట 9గంటల ఉచిత కరెంట్ పంపిణీ వంటి విషయాలను రైతులకు అవగాహన కల్పించేందుకు సిద్ధమవుతోంది.

    పొలాలకు మీటర్ల కనెక్షన్లపై రైతుల్లో అనేక సందేహాలు కలుగుతున్నాయి. మీటర్లు పెడితే కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీటర్లు కాలిపోవడం అనేది సహజమని.. అయితే వాటి మరమ్మతు.. కొత్తవాటిని అమర్చుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడాల్సి రావచ్చు. గతంలోనూ విద్యుత్ అధికారుల నిర్వాహాకంతో రైతులకు ఈ అనుభవాలు కొత్తమే కాదు. దీంతో రైతులు వ్యవసాయ మీటర్లకు కనెక్షన్లు పెట్టుకునేందుకు సుముఖత చూపడం లేదు.

    Also Read: నంబర్ 1 చానెల్ నుంచి వైదొలిగిన ప్రముఖ జర్నలిస్టు? కారణమేంటి?

    మీటర్లు కాలిపోతే ఉచితంగా మీటర్ ఇస్తామంటూ ప్రభుత్వం చెబుతున్నా రైతులు మాత్రం నమ్మడం లేదని తెలుస్తోంది. మరోవైపు ప్రతిపక్షాలు కొత్త మీటర్లు అమరిస్తే ధ్వంసం చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. పార్టీలు కొత్త మీటర్లను ధ్వంసం చేసుకుంటూ పోతే కొత్త వాటిని పెట్టడం సాధ్యం కాకపోవచ్చు. అలా కాకుండా మీటర్ పెట్టుకున్న పొలం రైతుపై కేసు పెడితే అది మరింత రగడకు దారితీసే అవకాశం ఉంది.

    దీంతో ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలా? అని జగన్ సర్కార్ మల్లగుల్లాలు పడుతోంది. వైసీపీ నేతలు సైతం రైతులతో పెట్టుకోవద్దని సూచిస్తారని సమాచారం. సొంత పార్టీ నేతలు సైతం వ్యతిరేకిస్తున్న ఈ పథకాన్ని సీఎం జగన్ ప్రజల్లోకి ఏవిధంగా తీసుకెళుతారనేది ఆసక్తికరంగా మారింది.