రెవెన్యూ శాఖలో అధికారుల అవినీతి విషయంలో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణా రాష్ట్రంలో కీసర తహసీల్దార్ రూ.కోటి లంచం వ్యవహారం వెలుగులోకి వచ్చిన కొద్ది రోజుల్లో ఏపీలో ఇటువంటి వ్యవహారమే వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో చేతులు మారిన లంచం ఎంతో తెలిస్తే ఆశ్చర్యానికి గురి కావాల్సిందే. రూ. 5 కోట్లు చేతులు మారాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…
Also Read: Even Jr NTR has zero stamina to make TDP a Blockbuster?
నెల్లూరు జిల్లాలోని కలువాయి మండల తహసీల్దార్ గతంలో పని చేసిన మానికల ప్రమీల వెయ్యి ఎకరాలకు సంబంధించిన భూముల రికార్డులను తారుమారు చేశారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకు వినతి ప్రతాన్ని సమర్పించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో గతంలోనే భూముల విషయంలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. టిడిపి ప్రభుత్వం ఇచ్చిన జి.ఓ ను అడ్డుపెట్టుకుని కొద్ది నెలల కిందట అసైన్డ్ భూములకు ఎన్ఓసి లు పొంది అక్రమంగా రిజిస్ట్రేషన్ లు చేయించిన సంఘటనపై కొద్ది రోజుల కిందట పలు ఆరోపణలు వచ్చాయి. నెల్లూరు ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ఇందుకు మూలమనే వాదనలు వినిపించాయి.
Also Read: Yet another Rude Shock for Jagan from SC!
తెలంగాణాలో కీసర తహసీల్దార్ రూ.కోటి లంచం తీసుకున్నారనే విషయం వెలుగులోకి రావడంతో ఆశ్చర్యానికి గురవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలను నెల్లూరు జిల్లాలో కలువాయిలో పని చేసిన తహసీల్దార్ ఏకంగా రూ.5 కోట్లు లంచం తీసుకోవడం విశేషం. ఈ వ్యవహారాలను పరిశీలిస్తే భూముల విషయంలో ప్రభుత్వం ఎన్ని నూతన విధానాలు తీసుకువస్తున్నా రెవెన్యూ సిబ్బంది మాత్రం లంచాలు తీసుకోకుండా పని చేయడం లేదు. మరోవైపు గతంలో రూ.10 నుంచి లక్షల్లో లంచాలు తీసుకునే అధికారులు ఇప్పుడు కార్పోరేట్ సంస్థల నిర్వాహకులతో కుమ్మక్కై ఏకంగా రూ.కోట్లలోనే లంచాలు తీసుకోవడం భూముల యజమానులను ఆందోళనకు గురి చేస్తుంది.