కేసీఆర్ సై అంటున్నాడు..! మరి జగన్ నై అంటాడా…?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబర్ 7 వ తారీఖు నుండి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ప్రారంభించాలని ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. నిబంధనలకు అనుగుణంగా సమావేశాలు ఏర్పాటు చేసి కనీసం ఇరవై రోజుల పాటు నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ కరోనా సమయంలో అసెంబ్లీ సమావేశాలు అనేవి అత్యంత కీలకమా అని అనుమానం రావచ్చు కానీ కరోనా ఉన్నా.. ఏ ఉపద్రవం వచ్చి జనాలను ముంచేసినా… వాటిని ఆపడానికి అవకాశం లేదు. ప్రత్యామ్నాయ పద్ధతులు ఎంచుకుని ప్రజాస్వామ్య ప్రక్రియను […]

Written By: Navya, Updated On : August 18, 2020 11:17 am
Follow us on

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబర్ 7 వ తారీఖు నుండి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ప్రారంభించాలని ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. నిబంధనలకు అనుగుణంగా సమావేశాలు ఏర్పాటు చేసి కనీసం ఇరవై రోజుల పాటు నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ కరోనా సమయంలో అసెంబ్లీ సమావేశాలు అనేవి అత్యంత కీలకమా అని అనుమానం రావచ్చు కానీ కరోనా ఉన్నా.. ఏ ఉపద్రవం వచ్చి జనాలను ముంచేసినా… వాటిని ఆపడానికి అవకాశం లేదు. ప్రత్యామ్నాయ పద్ధతులు ఎంచుకుని ప్రజాస్వామ్య ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకే కోవిడ్ నివారణ నిబంధనలకు తగ్గట్టు భౌతిక దూరాన్ని పాటిస్తూ… సీటింగ్ ఏర్పాటు చేసి సమావేశాలను నిర్వహించాలని చూస్తున్నారు.

Also Read: కరోనా ఎఫెక్ట్.. ఇంటికే గణేశుడు పరిమితం..!

సాధారణంగా వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ మాసంలో నిర్వహిస్తూ ఉంటారు. అవి కూడా ఎక్కువ రోజులపాటు జరుగుతూ ఉంటాయి. పార్లమెంటు సమావేశాలు కూడా అటుఇటుగా ఇదే సమయంలో జరగాల్సి ఉంది. అయితే ఏపీ ప్రభుత్వం కూడా ఇప్పుడు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. ఇక ఎప్పటి నుంచి నిర్వహించాలనుకుంటున్న విషయంపై వారు ఇంకా వెల్లడించనేలేదు. అసలు అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసే ఆలోచనలో జగన్ ప్రభుత్వం ఉన్నట్లు కనిపించట్లేదు. 

కరోనా కారణంగా భౌతికదూరం పాటిస్తూ నిర్వహించాల్సిన సమావేశాల కోసం చాలా ముందుగానే చాలా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. కనీసం ఒక నెల రోజుల ముందే అసెంబ్లీ లో ప్రస్తావించిన అంశాలను…. తీసుకుని రావాల్సిన తీర్మానాల గురించి హోంవర్క్ మొదలుపెడతారు ఎవరైనా. మరి ఏపీ సర్కారు అందుకు భిన్నంగా ఏమైనా ప్రవర్తించేందుకు సన్నాహాలు చేస్తోందా అన్న అనుమానం అందరిలో కలుగుతోంది.

Also Read: కారులో ముగ్గురు ఉండగానే తగలబెట్టేశాడు… విజయవాడలో దారుణం!

.ఇక ఈ విషయానికి వస్తే…. ఇప్పటికే మూడు రాజధానుల విషయం అటూ ఇటూ కాకుండా మధ్యలో ఆగిపోయింది. అసెంబ్లీలో అలాంటి అంశాన్ని లేవనెత్తి అక్కడ టైం వేస్ట్ చేసేటువంటివి అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి పూర్తి సన్నద్ధత తో ముందుకు వెళ్లాల్సిన ప్రభుత్వమే అందుకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకపోవడం చూస్తుంటే…. ఇది ఏదో తేడా వ్యవహారంలాగానే ఉందని విశ్లేషకులు అంటున్నారు. కెసిఆర్ వచ్చే నెల ఏడో తేదీన ముహూర్తం పెట్టుకున్నాడు. ఎంతకాదన్నా వచ్చే నెలలోనే సమావేశాలు ఏపీలో కూడా అయిపోవాలి.  మరి జగన్ ఏమి ఆలోచిస్తున్నట్లు?