https://oktelugu.com/

ఈ జర్నలిస్ట్ ని కూడా అరెస్ట్ చేస్తారేమో..?

సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ పై తప్పుడు వార్త రాశారని ఓ జర్నలిస్ట్‌‌‌‌ ను జూబ్లీహిల్స్‌‌‌‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇదే తరహాలో సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఆయనిప్పుడు ఏం చేస్తున్నారనే వివరాలను ప్రభుత్వమే వెల్లడించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ తీన్మార్ మల్లన్న బుధవారం హైకోర్టులో మాండమస్ పిటిషన్ దాఖలు చేశారు. సీఎం క్యాంప్ కార్యాలయమైన ప్రగతి భవన్‌లో 30 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చిందనీ… అప్పటి నుంచీ సీఎం కేసీఆర్ […]

Written By: , Updated On : July 8, 2020 / 09:29 PM IST
Follow us on

Teenmar mallanna

సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ పై తప్పుడు వార్త రాశారని ఓ జర్నలిస్ట్‌‌‌‌ ను జూబ్లీహిల్స్‌‌‌‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇదే తరహాలో సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఆయనిప్పుడు ఏం చేస్తున్నారనే వివరాలను ప్రభుత్వమే వెల్లడించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ తీన్మార్ మల్లన్న బుధవారం హైకోర్టులో మాండమస్ పిటిషన్ దాఖలు చేశారు. సీఎం క్యాంప్ కార్యాలయమైన ప్రగతి భవన్‌లో 30 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చిందనీ… అప్పటి నుంచీ సీఎం కేసీఆర్ ఫామ్‌ హౌస్‌ కి వెళ్లారని మల్లన్న తన పిటిషన్‌ లో గుర్తుచేశారు. దింతో సీఎం కి వ్యతిరేకంగా హైకోర్టు కి వెళ్లినా మల్లన్నను కూడా కేసీఆర్ సర్కార్ అరెస్ట్ చేస్తదేమో.. అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. సీఎం అందుబాటులో లేకుండాపోయేసరికి వివిధ శాఖల అధికారులు సక్రమంగా పనిచేయడంలేదని, దీంతో ప్రజల్లో కరోనా భయాలు మరింతగా పెరిగిపోతున్నాయని, అన్నింటికీ సమాధానంగా కేసీఆర్ పరిస్థితిపై ప్రభుత్వం వెంటనే స్పందించేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును పిటిషనర్ కోరారు.

ఇటీవల ఆదాబ్ హైదరాబాద్ పత్రిక ఈ-పేపర్‌‌‌‌‌‌‌‌ లో “సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ కు కరోనా” ,”హరితహారం కార్యక్రమంలో సోకిందా” వార్త పబ్లిష్‌‌‌‌ అయింది. దాని పేపర్‌‌‌‌‌‌‌‌ క్లిప్‌‌‌‌ సోషల్‌‌‌‌ మీడియాలో వైరల్‌‌‌‌ అయ్యింది. దీనిపై హైదరాబాద్‌‌‌‌ రహమత్ నగర్‌‌‌‌‌‌‌‌ కి చెందిన టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ కార్యకర్త మహ్మద్ ఇలియాస్ ఆదివారం జూబ్లీహిల్స్‌‌‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆదాబ్ హైదరాబాద్ జర్నలిస్ట్‌‌‌‌ వెంకటేశ్వరరావు, యాజమాన్యంపై ఐపీసీ 505(1)(బి), 505(2) రెడ్ విత్34 సెక్షన్లతో డిజాస్టర్ మేనేజ్‌‌‌‌మెంట్ యాక్ట్ సెక్షన్‌‌‌‌ 54 కింద కేసు నమోదు చేశారు. వెంకటేశ్వరరావు స్వస్థలం ఖమ్మం జిల్లాకు వెళ్లి ఆయన్ను అరెస్ట్‌‌‌‌ చేశారు.