ఈ మధ్య విశాఖపట్నంలో అధికారుల హడావుడి మొదలైనట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఓ ఉన్నతాధికారి విశాఖ పర్యటించి వచ్చారని, సీఎం కార్యాలయం కోసం సరైన ప్రదేశాన్ని ఎంపిక చేసే పని మీదే ఆయనకు అక్కడ వచ్చారని కొందరు అభిప్రాయ పడుతున్నారు.
కోర్టులు, చట్టాలకు చిక్కకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని తరలింపును రహస్యంగా కొనసాగిస్తోన్నట్లు తెలుస్తోంది. అమరావతిని రాజధానిగా ఉంచుతూనే, క్రియాశీల రాజధాని తరలింపు ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తోందనే టాక్ నడుస్తోంది. అవసరమైతే ఒక్కరోజులోనే సీఎం కార్యాలయాన్ని విశాఖకు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్లు విశ్వసనీయ సమాచారం
కాపులుప్పాడ ప్రాంతంలోని గ్రేహౌండ్స్ కు చెందిన భవనంలోనే సీఎం క్యాంపు కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంబేద్కర్ స్మృతివనం మార్పుతో రాజధాని విషయంలో ప్రభుత్వం తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పిందని, ఒకపక్క రాజధాని మార్పు వద్దని రైతుల ఆందోళన, న్యాయవివాదాలు, శాసన సంబంధ సమస్యలు ఉన్నా, తాను అనుకున్న విధంగా రాజధాని తరలింపును ప్రభుత్వం కొనసాగిస్తోందని కొందరు టీడీపీ నేతలు మధనపడుతున్నట్లు తెలుస్తోంది.