https://oktelugu.com/

బీజేపీని నీడలా వాడుతున్న టీడీపీ..! : నేతల హాట్‌ కామెంట్స్‌

ఎప్పటికైనా టీడీపీ తమ ట్రాప్‌లో పడాల్సిందేనని ఆంధ్రప్రదేశ్‌ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఎప్పుడో చెప్పారు. ఆ సందర్భంలో ఆయన వ్యాఖ్యలను అందరూ లైట్‌ తీసుకున్నారు. టీడీపీ ఏంటి బీజేపీ ట్రాప్‌లో పడడం ఏంటి అని అనుకున్నారు. కానీ.. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు.. పరిస్థితులను బట్టి చూస్తుంటే సోము వీర్రాజు చెప్పిన జోస్యం నిజమేనని అర్థం చేసుకోవాల్సి వస్తోంది. Also Read: తిరుపతి విషయంలో ఏం చేస్తాడో..: జనసేన కార్యకర్తల్లో టెన్షన్‌ టీడీపీ […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 21, 2021 / 01:35 PM IST
    Follow us on


    ఎప్పటికైనా టీడీపీ తమ ట్రాప్‌లో పడాల్సిందేనని ఆంధ్రప్రదేశ్‌ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఎప్పుడో చెప్పారు. ఆ సందర్భంలో ఆయన వ్యాఖ్యలను అందరూ లైట్‌ తీసుకున్నారు. టీడీపీ ఏంటి బీజేపీ ట్రాప్‌లో పడడం ఏంటి అని అనుకున్నారు. కానీ.. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు.. పరిస్థితులను బట్టి చూస్తుంటే సోము వీర్రాజు చెప్పిన జోస్యం నిజమేనని అర్థం చేసుకోవాల్సి వస్తోంది.

    Also Read: తిరుపతి విషయంలో ఏం చేస్తాడో..: జనసేన కార్యకర్తల్లో టెన్షన్‌

    టీడీపీ అధినేత చంద్రబాబుది ఏండ్ల రాజకీయ చరిత్ర. అంతకుమించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఏలిన సీఎం ఆయన. ఎవరైనా ఆయన ఎత్తుగడల ముందు మోకారిల్లాల్సిందే. పదవి పోయినంత మాత్రాన ఆయన ఇమేజీ తగ్గిన దాఖలాలు మాత్రం అంతంతే. అయితే.. రాష్ట్రంలో బీజేపీ ఓటు శాతం కేవలం ఒక్క శాతమే. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండొచ్చు కానీ, గ‌త సార్వత్రిక ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి నోటా కంటే త‌క్కువ ఓట్లే వచ్చాయి. పెద్దగా ఓటు బ్యాంకు కూడా లేని బీజేపీని నీడలా ఏర్పరచుకొని టీడీపీ రాజకీయ ప్రయాణం సాగిస్తుండడం ఆశ్చర్యపరుస్తోంది.

    ఆంధ్రప్రదేశ్‌లో ఆల‌యాల‌పై దాడులు, విగ్రహాల విధ్వంసాన్ని నిర‌సిస్తూ తిరుప‌తిలో నేడు ధ‌ర్మ ప‌రిర‌క్షణ యాత్ర పేరుతో టీడీపీ ఓ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అలిపిరి పాదాల చెంత గురువారం పూజ‌లు నిర్వహించి ప్రచార ర‌థాల‌ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రారంభించ‌నున్నారు.

    Also Read: ఏపీ ప్రజలు పండుగ చేసుకునే గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్

    అయితే.. ఇదే అలిపిరి సమీపంలోని కపిలతీర్థం టూ రామతీర్థం పేరుతో ఫిబ్రవరి 4 నుంచి రథయాత్రను బీజేపీ నిర్వహిస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటికే బీజేపీ ప్రకటించింది. ఇదే విష‌యాన్ని ఇప్పుడు బీజేపీ నాయకులు ప్రస్తావిస్తున్నారు. టీడీపీకి ఒక రాజ‌కీయ ఎజెండా అంటూ లేద‌ని, త‌మ నీడ‌లా వ‌స్తోంద‌ని విమ‌ర్శిస్తున్నారు.టీడీపీది ధ‌ర్మ పరిరక్షణ యాత్ర కాదని.. ఓటు బ్యాంకు యాత్ర అని పేరు పెట్టుకుని ఉంటే బాగుండేద‌ని బీజేపీ, వైసీపీ దుయ్యబడుతున్నాయి. నిజంగా హిందూత్వంపై ప్రేమ‌, న‌మ్మ‌కం ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ర‌థ‌యాత్ర చేయ‌డం లేద‌ని ఆ పార్టీలు నిల‌దీస్తున్నాయి.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్