మన దేశంతో పాటు ఇతర దేశాల్లో సైతం వాహనాలను దొంగతనం చేసేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా అమెరికాలో ఒక దొంగ కారును దొంగతనం చేశాడు. కారును దొంగలించి కారులో వెళుతుండగా దొంగకు కారులో పసిపిల్లాడు ఉన్నాడని అర్థమైంది. ఆ తరువాత ఆ దొంగ ఏం చేశాడు..? పసిపిల్లాడిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించాడా..? లేదా..? తెలియాలంటే ఈ కథ చదవాల్సిందే.
Also Read: ఆ గ్రామంలో వింత ఆచారం.. గొర్రెకు, పొట్టేలుకు వైభవంగా పెళ్లి..!
పూర్తి వివరాల్లోకి వెళితే అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రం పోర్ట్‌ల్యాండ్ ప్రాంతంలో శనివారం రోజున ఒక మహిళ నాలుగు సంవత్సరాల వయస్సు ఉన్న కొడుకును తీసుకుని ఒక దుకాణానికి వెళ్లింది. ఆ సమయంలో మహిళ కారును రన్నింగ్ లో ఉంచడంతో పాటు చంటిపిల్లాడిని కారులో ఉంచింది. ఆ తరువాత దుకాణానికి వెళ్లి పాలు, మాంసం కొనుగోలు చేసింది. అదే సమయంలో ఒక దొంగ రన్నింగ్ లో ఉన్న కారును తీసుకొని వెళ్లాడు.
Also Read: జనవరి లో పుట్టిన వారికి వంకాయ రంగు అదృష్టమేనా..?
పాలు, మాంసం కొనుగోలు చేసిన తరువాత కారు పార్కింగ్ చేసిన చోట కనిపించక పోవడంతో మహిళ కంగారు పడింది. కారులో బాలుడిని గుర్తించిన వెంటనే దొంగ యూటర్న్ తీసుకుని కారును ఎక్కడ దొంగతనం చేశాడో అక్కడికే వెళ్లాడు. కారు ఓనర్ అయిన మహిళకు పిల్లాడిని వెనక్కు ఇవ్వడంతో పాటు పిల్లాడి విషయంలో తల్లి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆమెను అరెస్ట్ చేయిస్తానని దొంగ బెదిరించాడు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
ఆ తరువాత మళ్లీ దొంగతనం చేసిన కారులోనే పారిపోయాడు. దొంగతనం చేసిన కారును మరో ప్రాంతంలో వదిలేసి దొంగ పారిపోయాడు. సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ అవుతుండగా ఆ దొంగ చాలా మంచి దొంగ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.