https://oktelugu.com/

ట్రంప్‌ కొత్త పార్టీ..! : అనౌన్స్‌ మాత్రం ఇప్పుడు కాదట

‘చింత చచ్చినా దాని పులుపు చావలేదు’ అన్నట్లు.. అమెరికా ప్రజలు ఛీత్కరించి ఉద్వాసన పలికినా ఇంకా ట్రంప్‌లో మాత్రం ఆశలు చావడం లేదు. డోనాల్డ్ ట్రంప్ నిన్నటితో మాజీ అధ్యక్షుడిగా మారిపోయారు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ల ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. తన కుటుంబానికి చెందిన 127 ఏళ్ల బైబిల్ పై బైడెన్ ప్రమాణం చేశారు. అయితే చివరి […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 21, 2021 / 01:50 PM IST
    Follow us on


    ‘చింత చచ్చినా దాని పులుపు చావలేదు’ అన్నట్లు.. అమెరికా ప్రజలు ఛీత్కరించి ఉద్వాసన పలికినా ఇంకా ట్రంప్‌లో మాత్రం ఆశలు చావడం లేదు. డోనాల్డ్ ట్రంప్ నిన్నటితో మాజీ అధ్యక్షుడిగా మారిపోయారు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ల ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. తన కుటుంబానికి చెందిన 127 ఏళ్ల బైబిల్ పై బైడెన్ ప్రమాణం చేశారు. అయితే చివరి క్షణం వరకు ట్రంప్ తన ఓటమిని అంగీకరించలేదు. శతవిధాలా పోరాడి చివరికి శ్వేతసౌధం నుండి బయటకి వచ్చేశారు.

    Also Read: అధికారాలు లేకున్నా.. ఆ పదవి కూడా కీలకమే..!

    ఇదిలా ఉండగా.. ఇపుడు మరో కొత్త విషయం వినిపిస్తోంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంతంగా పార్టీ పెట్టే యోచనలో ఉన్నారట. తన ఓటమిని అంగీకరించని ట్రంప్ నూతన అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా హాజరు కాలేదు. ఈ క్రమంలో ఆయన సొంత పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ట్రంప్ పెట్టబోయే పార్టీ పేరు పేట్రియట్ పార్టీ. ఆ పార్టీని ఇప్పటికిప్పుడు కాకపోయినా కొంచెం సమయం తీసుకొని ప్రకటించనున్నారు. ప్రస్తుతం క్యాపిటల్ భవనంపై దాడి నేపథ్యంలో తనపై ప్రతికూలత నెలకొన్న నేపథ్యంలో కాస్త పరిస్థితులు చక్కదిద్దుకున్నాక.. పార్టీ పేరును ప్రకటించాలని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం.

    Also Read: ఆదాయపు పన్ను చెల్లించే వాళ్లకు కేంద్రం శుభవార్త చెప్పనుందా..?

    ట్రంప్ చివరిసారిగా ఓ వీడియో సందేశాన్నిచ్చారు. దేశానికి తానెంతో చేశానని తిరిగి వస్తానంటూ చెప్పుకొచ్చారు. దేశం కోసం శ్రమించేందుకు లక్షలాది మంది ఉన్నారని.. మనమంతా కష్టించి దేశ చరిత్రలోనే ఓ గొప్ప రాజకీయ ఉద్యమాన్ని చేపట్టామని, ఈ ఉద్యమం అంతం కాదని, ఆరంభం మాత్రమేనని ట్వీట్ చేశారు. ‘ఈ వారంలో దేశంలో కొత్త పాలన యంత్రాంగం బాధ్యతలు చేపడుతుంది. దానికి నా శుభాకాంక్షలు. అమెరికాను భద్రంగా సౌభాగ్యంగా ఉంచడంలో ఆ కొత్త టీమ్ విజయం సాధించాలని మనమంతా ప్రార్థిద్దాం. వారికి అదృష్టం కూడా కలిసి రావాలని కోరుకుంటున్నాను’ అని వ్యాఖ్యానించారు. ఆ ప్రసంగం మొత్తంలో కనీసం బైడెన్ పేరు కూడా పలకలేదు. అదే విధంగా తన హయాంలో సాధించిన కొన్ని విజయాలను మాత్రం వల్లె వేసుకున్నారు.

    మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు