Ratan Tata : గొప్ప గొప్ప పనులు చేసి.. తమ జీవితానికి అసలైన అర్ధాన్ని తెచ్చుకున్న మహనీయుల జాబితాలో రతన్ టాటా (Ratan Tata) ముందువరుసలో ఉంటారు. రతన్ టాటా కాలం చేసి నెలలు గడుస్తున్నప్పటికీ.. ఆయన వీలునామా గురించి ఇంతవరకు బయటి ప్రపంచానికి తెలియలేదు. రతన్ మరణం తర్వాత ఆయన వద్ద ఉన్న పదివేల కోట్ల ఆస్తులు ఎవరికీ దక్కుతాయనే విషయం నిన్నటిదాకా సస్పెన్స్ గానే ఉంది. అయితే అవన్నీ సోదరుడు జిమ్మీ టాటా, రతన్ నెలకొల్పిన ఫౌండేషన్లు, ఇతరులకు లభిస్తాయని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు రతన్ ఆస్తులకు సంబంధించిన మరో కథనం వెలుగులోకి వచ్చింది.. రతన్ టాటా తన ఆస్తుల్లో ఎక్కువ శాతాన్ని దాతృత్వ కార్యక్రమాలకు కేటాయించినట్లు తెలుస్తోంది. రతన్ టాటా తను సంపాదించిన ఆస్తుల్లో దాదాపు 3,800 కోట్లను దాతృత్వ కార్యక్రమాలకు కేటాయించారు.. రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, ఎండోమెంట్ ట్రస్ట్ కు కేటాయించినట్టు తెలుస్తోంది. అయితే ఇందులో టాటా సన్స్ లో తనకు ఉన్న వాటాలు.. ఇతర ఆస్తులను వీటికి రతన్ టాటా కేటాయించారు.. రతన్ టాటా సవతి సోదరీమణులు శిరీన్, దియానా కు 800 కోట్లు ఇచ్చారు.. అయితే ఇందులో ఫిక్స్డ్ డిపాజిట్లు, స్టాక్స్.. ఖరీదైన గడియారాలు.. పెయింటింగ్స్ వంటి విలువైన వస్తువులు ఉన్నాయి. రతన్ టాటా తనకు అత్యంత సన్నిహితుడైన మోహిన్ ఎం దత్తాకు 800 కోట్ల విలువైన ఆస్తులు ఇచ్చారు. రతన్ టాటాకు ముంబైలోని జిగు ప్రాంతంలో బంగ్లా లో పాటతో పాటు కొన్ని వెండి వస్తువులను.. బంగారు ఆభరణాలను జిమ్మీ నావెల్ టాటాకు రతన్ కేటాయించారు.. ఆలీబాగ్ ప్రాంతంలో ఉన్న బంగ్లా.. మూడు పిస్తోళ్ల ను తన ప్రియమిత్రుడు మోహిల్ మిస్త్రి రతన్ టాటా కేటాయించినట్టు తెలిసింది.
Also Read : అంతరిక్షం నుంచి భారత్ ఎలా ఉంటుందో తెలుసా.. సునీతా విలియమ్స్ అనుభవం
మూగజీవాలకు కూడా
రతన్ టాటా వీలు నామాలో మూగజీవాలను వదిలిపెట్టలేదు.. మూగజీవాల సంరక్షణ కోసం 12 లక్షల రూపాయలను ఆయన పక్కన పెట్టారు.. ప్రతి త్రైమాసికానికి 30 వేల చొప్పున అందేలాగా వాటిని కేటాయించారు. రతన్ టాటాకు జీవిత చరమాంకంలో అత్యంత సన్నిహితుడిగా మెదిలిన శంతను నాయుడు (Shantanu Naidu) కు కూడా వీలునామాలు సంస్థ ప్రాధాన్యం లభించింది. గతంలో శంతనుకు ఇచ్చిన విద్యార్థి రుణాన్ని రతన్ మాఫీ చేశాడు.. షేర్లు.. కొంత నగదు.. బంగారు ఆభరణాలు శంతనుకు అంతేలాగా రతన్ తన వీలు నామాలో రాశారు. తన పొరుగు ఇంట్లో ఉండే జేక్ మాలిటే అనే వ్యక్తికి రతన్ 23 లక్షలు అప్పుగా ఇవ్వగా.. దాన్ని కూడా రద్దు చేశారు. రతన్ టాటా కు విదేశాల్లో 40 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.. అయితే రతన్ వీలునామా ప్రకారం ఆస్తులు పరిశీలించి కేటాయింపులు జరపాలని బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈ ప్రక్రియ ముగిసే వరకు మరో ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.
Also Read : త్రిభాషా విధానంపై వివాదం.. యోగి–స్టాలిన్ డైలాగ్ వార్!