https://oktelugu.com/

జగన్ సర్కార్ మెడకు ‘బాక్సైట్’ ఉచ్చు

ఏపీ సీఎం జగన్ చేసిన లీజు రద్దులు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి. జిందాల్, అన్ రాక్ సంస్థలు న్యాయపోరాటం చేస్తూ భారీ పరిహారం పొందేందుకు యోచిస్తున్నాయి. జగన్ సర్కార్ నిండుకున్న ఖజానాకు ఈ పరిణామం పెద్ద దెబ్బగా పరిణమించింది. దీంతో కేంద్రంతో మాట్లాడిన రద్దు చేసిన బాక్సైట్ లీజుల స్థానంలో ఒడిషా బాక్సైట్ గనులు ఇప్పించేందుకు జగన్ సర్కార్ ఆపసోపాలు పడుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జిందాల్, యూఏఈలోని రస్ అల్ ఖైమా దేశానికి […]

Written By:
  • NARESH
  • , Updated On : December 21, 2020 / 12:50 PM IST
    Follow us on

    ఏపీ సీఎం జగన్ చేసిన లీజు రద్దులు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి. జిందాల్, అన్ రాక్ సంస్థలు న్యాయపోరాటం చేస్తూ భారీ పరిహారం పొందేందుకు యోచిస్తున్నాయి. జగన్ సర్కార్ నిండుకున్న ఖజానాకు ఈ పరిణామం పెద్ద దెబ్బగా పరిణమించింది. దీంతో కేంద్రంతో మాట్లాడిన రద్దు చేసిన బాక్సైట్ లీజుల స్థానంలో ఒడిషా బాక్సైట్ గనులు ఇప్పించేందుకు జగన్ సర్కార్ ఆపసోపాలు పడుతోంది.

    వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జిందాల్, యూఏఈలోని రస్ అల్ ఖైమా దేశానికి చెందిన అన్ రాక్ సంస్థకు విశాఖ మన్యంలోని బాక్సైట్ గనులు కేటాయించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక గతంలో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేశారు. దీనిపై రెండు సంస్థలు న్యాయపోరాటం చేశాయి. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక లీజులను రద్దు చేశారు. దీంతో జిందాల్, అన్ రాక్ సంస్థలు లా ట్రిబ్యూనల్, అంతర్జాతీయ కోర్టుల్లో కేసులు వేశాయి. దీంతో ఏపీ సర్కార్ కు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.

    ఒడిషా నుంచి అన్ రాక్ సంస్థకు బాక్సైట్ ఇప్పించాలని ఏపీ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే అక్కడి ప్రభుత్వం ఇప్పటికే వేరే సంస్థకు లీజుకు ఇచ్చింది. దీంతో భారీగా చెల్లించి లీజు తీసుకోలేక.. అన్ రాక్ తో పోరాటం చేయలేక ఏపీ ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. కేంద్రం జోక్యం చేసుకొని ఒడిషాలోని బాక్సైట్ ఇప్పించాలని జగన్ సర్కార్ కోరుతోంది.

    ఆన్ రాక్ కొడుతున్న దెబ్బకు ఒడిషా నుంచి బాక్సైట్ ఇప్పించి చేతులు దులుపుకోవాలని ప్రయత్నిస్తున్నా అది కూడా కేంద్రం దయాదాక్షిణ్యాలపై జగన్ సర్కార్ ఆధారపడాల్సిన పరిస్థితి దాపురించడంతో ఈ వ్యవహారం జగన్ సర్కార్ మెడకు గుదిబండలా తయారవుతోంది.