కరోనా రాకతో దేశంలో లాక్డౌన్ విధించారు. ఇప్పుడు అది ఎంతకు తగ్గకపోవడంతో ఇక అన్ లాక్ బాటపట్టారు. జనాలు సైతం కరోనాను తమలో ఒక భాగంగా.. ఓ చిన్న జ్వరం దులుపుకొని పోతున్నారు. తాజాగా కేంద్రం కూడా లైట్ తీసుకుంది.అన్ లాక్ 5లో థియేటర్ల నుంచి దాదాపు అన్నింటికి కేంద్రం ఓకే చెప్పింది. దశల వారీగా వివిధ రంగాలను తెరుచుకునేందుకు అవకాశం కల్పించింది. అక్టోబర్ 31 వరకు అన్ లాక్ 5 నిబంధనలు అమల్లో ఉంటాయని కేంద్రం తెలిపింది.
Also Read: జగన్ కేంద్రంలో చేరితే పవన్ కళ్యాణ్ ఎక్కడ?
ఇక అక్టోబర్ 15 నుంచి పాఠశాలలు, కోచింగ్ సెంటర్లు తెరుచుకునేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అధికారం ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.ఆన్ లైన్, దూర విద్య తరగతులు నిర్వహించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. పాఠశాలలు, కళాశాలలకు విద్యార్థులు హాజరుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేస్తూ నిబంధనలు మార్చారు.
కేంద్రం సూచించిన అన్ లాక్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో చదువులను చక్కబెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 15 నుంచి కళాశాలలు, పట్టభద్రులు హాజరయ్యేలా అనుమతి ఇచ్చింది. క్రీడాకారులకు ఈత కొలనులను వినియోగించుకునేందుకు అక్టోబర్ 15 వరకు అనుమతి ఇచ్చింది.
Also Read: ‘అమరావతి’పై ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం
ఇక ఏపీలో 50శాతం సామర్త్యంతో సినిమాలు, మల్టీప్లెక్సులు తెరిచేందుకు అనుమతి మంజూరు చేసింది. పార్కులు, ఇతర వినోద కార్యక్రమాలను అక్టోబర్ 15 తర్వాత తెరువనున్నారు.