వైసీపీ గుర్తింపు రద్దు కోసం టీడీపీ స్కెచ్?

ఏపీలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ను అటు ప్రతిపక్ష టీడీపీ.. మరికొందరు ప్రత్యర్థులు ప్రశాంతంగా పాలించుకోవడం లేదు. ముఖ్యంగా కోర్టులతో వైఎస్ జగన్ సర్కార్ ను ఫుట్ బాల్ ఆడుతున్నారనే చర్చ సాగుతోంది. వైసీపీ పార్టీని ఎలాగైనా సరే అస్థిరపరచాలని చేస్తున్న ఈ యవ్వారాలు ఆ పార్టీకి శరాఘాతంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ అయిన వైసీపీని టార్గెట్ చేశారు. ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలంటూ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ అనే […]

Written By: NARESH, Updated On : September 4, 2020 10:10 am

ap ycp flag

Follow us on


ఏపీలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ను అటు ప్రతిపక్ష టీడీపీ.. మరికొందరు ప్రత్యర్థులు ప్రశాంతంగా పాలించుకోవడం లేదు. ముఖ్యంగా కోర్టులతో వైఎస్ జగన్ సర్కార్ ను ఫుట్ బాల్ ఆడుతున్నారనే చర్చ సాగుతోంది. వైసీపీ పార్టీని ఎలాగైనా సరే అస్థిరపరచాలని చేస్తున్న ఈ యవ్వారాలు ఆ పార్టీకి శరాఘాతంగా మారాయి.

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ అయిన వైసీపీని టార్గెట్ చేశారు. ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలంటూ 

అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ అనే  ఢిల్లీ హైకోర్టులో పిటీషన్వేశారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అన్న పేరు వాడేందుకు వీళ్లేదని కేంద్ర ఎన్నికలకమిషన్ ఆదేశించినా.. అధికార వైసీపీ దాన్ని లెక్క చేయడం లేదని.. అందుచేత దాని గుర్తింపును రద్దు చేయాలని మహబూబ్ పిటీషన్ వేశారు.

ఈ పిటీషన్ పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని వైసీపీకి నాలుగు వారాలు గడువు ఇచ్చారు. తదుపరి విచారణను నవంబర్ 4కు వాయిదా వేశారు.

వైసీపీ పార్టీ తనదేనని.. జగన్ సారథ్యంలోని వైసీపీ కాదని.. అందరికంటే ముందే తాను వైసీపీని రిజిస్ట్రర్ చేయించానని మహబూబ్ అంటున్నారు.

కానీ కొంతమంది మాత్రం మహబూబ్ వెనుకాల టీడీపీ ఉండే ఈ నాటకాలు ఆడిస్తోందని.. వైసీపీ పార్టీ గుర్తింపు రద్దు కోసం పోరాడుతోందని ఆరోపిస్తున్నారు.