https://oktelugu.com/

 ‘పవన్-త్రివిక్రమ్’ కో‘బలి’? ఈసారి ఏమవుతుంది?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బీజీగా మారిన సంగతి తెల్సిందే. ఇప్పటికే పవన్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. కరోనా కారణంగా ఆగిపోయిన సినిమాలను ప్రారంభించేందుకు పవన్ రెడీ అవుతున్న సమయంలో పవన్ 30వ సినిమాపై జోరుగా ప్రచారం జరుగుతోంది. పవన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో పవన్ 30వ సినిమా ఉండనుందనే టాక్ ఫిల్మ్ వర్గాల్లో విన్పిస్తోంది. సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజును […]

Written By:
  • NARESH
  • , Updated On : September 4, 2020 / 10:30 AM IST

    pawan trivikram

    Follow us on

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బీజీగా మారిన సంగతి తెల్సిందే. ఇప్పటికే పవన్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. కరోనా కారణంగా ఆగిపోయిన సినిమాలను ప్రారంభించేందుకు పవన్ రెడీ అవుతున్న సమయంలో పవన్ 30వ సినిమాపై జోరుగా ప్రచారం జరుగుతోంది. పవన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో పవన్ 30వ సినిమా ఉండనుందనే టాక్ ఫిల్మ్ వర్గాల్లో విన్పిస్తోంది.

    సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజును పురస్కరించుకొని అభిమానులకు దర్శకులు సర్ ప్రైజ్ గిఫ్ట్ అందించారు. పవన్ వరుస సినిమాల అప్డేట్స్ అందించి ఆకట్టుకున్నారు. ‘వకీల్ సాబ్’ నుంచి మోషన్ పోస్టర్ రిలీజు అయింది. అదేవిధంగా దర్శకుడు క్రిష్ సైతం పవన్ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నాడు. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ మూవీకి సంబంధించి ఒక బైక్ పోస్టర్ విడుదల చేసి ఆకట్టుకున్నాడు.

    ఈ సినిమా తర్వాత పవన్ కల్యాణ్ ‘సైరా’ దర్శకుడు సురేందర్ రెడ్డితో కలిసి పని చేయబోతున్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి. ఈ సినిమాలతో పవన్ మరో మూడేళ్లపాటు బీజీగా ఉండబోతున్నాయి. అయితే అప్పుడే పవన్ 30వ సినిమాలపై వార్తలు విన్పిస్తున్నాయి. పవన్ 30వ సినిమా కోసం దర్శకుడు త్రివిక్రమ్, అతని శిష్యుడు వెంకీ కుడుముల పోటీపడుతున్నారు. ఇక గతంలో పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘జల్సా’.. ‘అత్తారింటికి దారేదీ’ మూవీలు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాయి. అయితే పవన్ చివరి చిత్రంగా వచ్చిన ‘అజ్ఞాతవాసి’ మాత్రం అనుకున్నంత విజయం సాధించలేదు.

    తాజాగా పవన్ తో మరోసారి త్రివిక్రమ్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. గతంలోనే ఈమేరకు త్రివిక్రమ్ మాట తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో ‘కోబలి’ చిత్రం రాబోతుందని సమాచారం. గత ఏడేళ్ల క్రితమే పవన్ కల్యాణ్ తో ‘కోబలి’ చిత్రాన్ని తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేశాడు. అయితే అనివార్య కారణాలతో సినిమా ప్రారంభానికి నోచుకోలేదు.

    రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ‘కోబలి’ ఉంటుందని అప్పట్లో టాక్ విన్పించింది. మంచి కమర్షియల్ అండ్ మెసెజ్ ఒరియేంటెడ్ కథ అయిన ‘కోబలి’ని పవన్ కోసం మళ్లీ తెరపైకి త్రివిక్రమ్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. మరోసారి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయాలని త్రివిక్రమ్ ‘కోబలి’ కథను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈసారైనా ‘కోబలి’ పట్టాలెక్కుతుందో లేదో వేచి చూడాల్సిందే..!