TDP: ఆంధ్రప్రదేశ్ లో త్వరలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు హాజరు కావాలా వద్దా అనే సందిగ్ధంలో టీడీపీ ఉంది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాల్సిందేనా అనే దానిపై ప్రధానంగా చర్చించారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై వచ్చిన ఆరోపణల సందర్భంగా ఆయన ఇక తాను సభకు రానని శపథం చేసి మరీ వెళ్లారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తాను సభకు రానని చెబుతున్నారు. తాము కూడా సభకు వెళ్లమని ఎమ్మెల్యేలు చెబుతుండటంతో చంద్రబాబు సర్దిచెబుతున్నారు. సభలో ప్రతిపక్షం లేకుంటే విలువ ఉండదు. అందుకే మనం కచ్చితంగా వెళ్లాల్సిందేనని సూచిస్తున్నారు.
దీనిపై టీడీపీ కూలంకషంగా చర్చించింది. సభలో పాల్గొని అధికార పార్టీ ఆగడాలను అడ్డుకోవాలని భావిస్తోంది. అధికార పార్టీ దురాగాతాలకు అడ్డుకట్ట వేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే సభలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ప్రధానంగా చర్చ జరిగింది. వైసీపీ నిర్ణయాలతో రాష్ట్రంలో పురోగతి కనిపించడం లేదని తెలుస్తోంది. దీన్నే ప్రధాన అస్త్రంగా చేసుకుని వైసీపీపై ఎదురుదాడి చేయాలని వ్యూహాలు ఖరారు చేస్తోంది.
దీనికి గాను ఎమ్మెల్యేలందరు సిద్ధం కావాలని చెబుతోంది. రాబోయే ఎన్నికల నేపథ్యంలో వైసీపీని ఎక్కడికక్కడ నిలువరించే ప్రయత్నాల్లో భాగంగా టీడీపీ అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. విజయగర్వంతో విర్రవీగిపోతున్న వైసీపీకి చెక్ పెట్టాలని నిర్ణయించుకుంది. దీనికి అన్ని దారులను అవకాశంగా మలుచుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో సభ నిర్వహణలో ప్రజల పక్షంగా నిలబడి వైసీపీని నిలదీసేందుకు రెడీ అవుతోన్నట్లు కనిపిస్తోంది.
Also Read: ఫైర్ బ్రాండ్ కొడాలి నానికి వేటు తప్పదా.. ఆయన ప్లేస్ లో వచ్చేది అతనేనట..
చంద్రబాబు సభలో ఉన్నప్పుడే పట్టించుకోని సీఎం జగన్ ఇక బాబు రాకపోతే టీడీపీ ఎమ్మెల్యేలకు అవకాశం ఇస్తారా? లేక వారితో ఆడుకుంటారా? అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. బాబునే లెక్కచేయని జగన్ ఎమ్మెల్యేలకు తగిన గౌరవం ఇస్తారా? లేదా అనేది సందిగ్దం నెలకొంది. మొత్తానికి టీడీపీకి మాత్రం కష్టాలే రానున్నాయని తెలుస్తోంది.
చంద్రబాబు రాకున్నా తాము జగన్ ను ఎదుర్కొంటామని టీడీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అధికార పార్టీ చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతామని భావిస్తున్నారు. ప్రజల ఇబ్బందులను సభా వేదికగా నిలదీస్తామని చర్చించుకుంటున్నారు. ఏదిఏమైనా బడ్జెట్ సమావేశాల్లో ఎంతమేరకు ప్రభావం చూపుతారో వేచి చూడాల్సిందే.
Also Read: పోలవరంపై కేంద్రం హామీలు సరే.. నిలబెట్టుకుంటదా.. నమ్మొచ్చా..?