Tollywood Villain Rami Reddy: అసలు విలన్లు ఇంత కర్కశంగా ఉంటారా అని నిరూపించిన విలన్లు తెలుగులో చాలామందే వచ్చారు. అయితే, వారిలో రామిరెడ్డి ది ప్రత్యేక శైలి. ఒక సినిమాతో రామిరెడ్డి స్టార్ అయిపోలేదు. ఎన్నో సినిమాల్లో తనదైన శైలిలో ఆయన అలరించాడు. ముఖ్యంగా కొన్ని సినిమాల్లో రామిరెడ్డిని చూసి కొన్ని సార్లు ప్రేక్షకులతో పాటు సినిమావాళ్లు కూడా జడుసుకున్నారు. ఆ సినిమాలేంటో చూద్దాం.
1. అమ్మోరు:
ఈ సినిమాలో రామిరెడ్డి అవతారం చూసి.. అందరూ షాక్ అయ్యారు. అప్పటికే రమ్యకృష్ణ గారి ఎంట్రీకి సగం మంది ప్రేక్షకులు భయంతో వణికిపోయారు. పైగా రామిరెడ్డి తన విలనిజంతో రెండు రెట్లు భయాన్ని కలిగించాడు.
2. అంకుశం:
ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కి కరెక్ట్ మొగుడులా రామిరెడ్డి పాత్ర ఉంటుంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు నిజంగానే రామిరెడ్డి రౌడీషీటర్ అనుకున్నారు. రామిరెడ్డి నటన అంత సహజంగా ఉంటుంది ఈ సినిమాలో.
Also Read: హీరోలందు పవన్ కళ్యాణ్ వేరయా !
3. ఒసే రాములమ్మ:
రామిరెడ్డి సినీ కెరీర్ లో మర్చిపోలేని సినిమా ఇది. ఈ సినిమాలో పూర్తిగా ఆసామీ పాత్రలోకి లీనం అయిపోయి నటించాడు రామిరెడ్డి. ఇంత పవర్ ఫుల్ గా అసలు రామిరెడ్డి ఎలా నటిస్తున్నాడు ? అని జనం షాక్ అయిన సినిమా ఇదే.
ఒక సాధారణ వ్యక్తి ఇంత కర్కశంగా విలన్ పాత్రలలో ఎలా ఒదిగిపోతున్నాడు అని ఆ రోజుల్లో మీడియా జనం కూడా షాక్ అవుతుండేవారు. అందుకే.. మళ్ళీ తెలుగు సినిమా పరిశ్రమలోకి రామిరెడ్డి లాంటి విలన్ మళ్ళీ వస్తారని ఊహించలేం.
Also Read: పెళ్లిపీటలెక్కబోతున్న వెంకటేశ్ కుమారుడు.. పెళ్లి కూతురు ఎవరో తెలిసా?