Smriti Mandhana: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఈరోజు పాకిస్థాన్‌తో జరుగుతున్న ఫస్ట్ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 50 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 244 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 4 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. షెఫాలీ వర్మ డకౌట్‌గా వెనుతిరిగింది. ఈ దశలో దీప్తి శర్మ (40)తో కలిసి స్మృతి మంధాన పోరాడింది.

మూడు ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో స్మృతి 52 పరుగులతో రాణించింది. అయితే స్మృతి మంధాన అవుట్ అయ్యాక టీమిండియా కష్టాల్లో పడింది. స్వల్ప వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ మిథాలీరాజ్ (9) విఫలమైంది. ఇన్నింగ్స్ చక్కదిద్దాల్సిన టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా అనవసరపు షాట్ కోసం యత్నించి జట్టును మరింత కష్టాల్లోకి నెట్టింది.
Also Read: చంద్రబాబు రాకున్నా.. తెలుగు తమ్ముళ్ల క్లారిటీ!
అనంతరం వచ్చిన హర్మన్ ప్రీత్ కౌర్ (5), రిచా ఘోష్ (1) కూడా వెంటవెంటనే అవుటయ్యారు. ఈ దశలో స్నేహ్ రానా, పూజా వత్సాకర్ ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిలో పడ్డారు. వీరిద్దరూ కలిసి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు మంచి స్కోరు అందించారు. ఆరు వికెట్లు పడిన సమయంలో టీమిండియా ఆలౌట్ అవుతుందేమో అని అందరూ భావించారు.
కానీ రానా, వత్సాకర్ రాణించడంతో 50 ఓవర్లలో టీమిండియా గౌరవప్రదమైన స్కోరు చేసింది. స్నేహ్ రానా (53 నాటౌట్)గా నిలవగా, పూజా 67 పరుగుల వద్ద బౌల్డ్ అయ్యింది. అనంతరం జూలన్ గోస్వామి 6 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. పాకిస్తాన్ తో ఇప్పటివరకు ఆడినా 10 మ్యాచుల్లో ఇండియా విన్ అయింది. మిథాలీ రాజ్ నేతృత్వంలో ఆడుతుండటంతో ఈ మ్యాచ్ ను అంతా ఆసక్తిగా చూస్తున్నారు.