కన్నా తొలగింపును జీర్ణించుకోని టీడీపీ మీడియా

ఊహించని షాక్ తగిలింది. కేంద్రంలోని బీజేపీ ఇంత ఖచ్చితంగా.. నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకొని ఎలాంటి అలిగేషన్స్ లేని నిక్కచ్చిగా పోరాడే సోము వీర్రాజును ఏపీ బీజేపీ అధ్యక్షుడిని చేసింది. తెలంగాణలో బండి సంజయ్ వలే. ఏపీలో సోమూ వీర్రాజు కూడా ఫైర్ బ్రాండ్. ఉన్నది ఉన్నట్టు అనే నేత. టీడీపీ కుట్రలు.. కుతంత్రాలపై నిగ్గదీసి అడిగిన మనిషి. Also Read: బీజేపీ ఆపరేషన్ సక్సెస్ అయితే వైసీపీ, టీడీపీకి చిత్తడే..! ఇన్నాళ్లు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా […]

Written By: NARESH, Updated On : July 29, 2020 10:52 am
Follow us on


ఊహించని షాక్ తగిలింది. కేంద్రంలోని బీజేపీ ఇంత ఖచ్చితంగా.. నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకొని ఎలాంటి అలిగేషన్స్ లేని నిక్కచ్చిగా పోరాడే సోము వీర్రాజును ఏపీ బీజేపీ అధ్యక్షుడిని చేసింది. తెలంగాణలో బండి సంజయ్ వలే. ఏపీలో సోమూ వీర్రాజు కూడా ఫైర్ బ్రాండ్. ఉన్నది ఉన్నట్టు అనే నేత. టీడీపీ కుట్రలు.. కుతంత్రాలపై నిగ్గదీసి అడిగిన మనిషి.

Also Read: బీజేపీ ఆపరేషన్ సక్సెస్ అయితే వైసీపీ, టీడీపీకి చిత్తడే..!

ఇన్నాళ్లు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఫక్తు టీడీపీ నాయకుడిలానే వ్యవహరించాడన్న ఆరోపణలు ఉన్నాయి. అటు సొంత బీజేపీలోనూ.. ఇటు వైసీపీలోనూ కన్నా వైఖరిపై తీవ్ర అనుమానాలున్నాయి. కన్నా బీజేపీలో ఉన్నా మనసు మాత్రం టీడీపీ.. చంద్రబాబు చుట్టూ తిరుగుతుందని విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే టీడీపీకి ఎంతో ఫేవర్ గా ఉంటున్న కన్నాను తొలగించి ఫైర్ బ్రాండ్ అయిన సోము వీర్రాజును ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా చేయడంతో టీడీపీలో.. దాని అనుకూల మీడియాలో ఒకటే ఏడుపు కనిపిస్తోంది.

కన్నా లక్ష్మీనారాయణను ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా తొలగించినందుకు టీడీపీ మీడియా గగ్గోలు పెడుతోంది. కన్నాను తీసేయడం ఊహించని షాకింగ్ ఘటనగా భావిస్తోంది. కన్నానే పదవిలో కొనసాగిస్తారని.. లేకపోతే టీడీపీకి కాస్త అనుకూలమైన ఎమ్మెల్సీ మాధవ్ కు బీజేపీ చీఫ్ పదవి ఇస్తారని భావించారు. మాధవ్ వచ్చినా టీడీపీకి అనుకూలంగా మేనేజ్ చేయొచ్చని టీడీపీ ఆశపడింది. కానీ అందరికీ షాకిస్తూ ‘సోము వీర్రాజు’ను బీజేపీ అధిష్టానం అందలమెక్కించింది.

Also Read: కొత్త జిల్లాలతో జగన్ కు తలనొప్పులు తప్పవా?

సోము వీర్రాజుకు ఏపీ బీజేపీ చీఫ్ ఇవ్వడం వెనుక బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ స్కెచ్ ఉందని టీడీపీ మీడియా హౌస్ లు అంచనా వేస్తున్నాయి. ఇక దీంతోపాటు గత కొన్ని వారాలుగా వైసీపీ కీలక నాయకుడు విజయ సాయిరెడ్డి.. తరుచుగా కన్నా లక్ష్మీనారాయణకు టీడీపీతో సంబంధాలున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విషయం తెలిసే బీజేపీ అధిష్టానం కన్నాను తొలగించిందని టీడీపీ మీడియా నమ్ముతోంది.

విజయసాయిరెడ్డికి కేంద్రంలోని బీజేపీ సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ క్రమంలోనే కన్నా తొలగింపు వెనుక విజయసాయిరెడ్డి హస్తం ఉందని టీడీపీ మీడియా భావిస్తోంది. మొత్తానికి టీడీపీకి కొరుకుడు పడని సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడు కావడంతో టీడీపీ మీడియా జీర్ణించుకోలేకపోతోందని తెలిసింది.