తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఖచ్చితంగా బలపడాలని చూస్తున్న కేంద్రంలోని బీజేపీ అందుకు అనుగుణంగానే ఫైర్ బ్రాండ్ అయిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు రాష్ట్ర పగ్గాలు అప్పగించింది. అయితే కథ అక్కడితో అయిపోలేదు. బండి సంజయ్ ముందర ఎన్ని చిక్కుముడులున్నాయి.
Also Read: బీజేపీ ఆపరేషన్ సక్సెస్ అయితే వైసీపీ, టీడీపీకి చిత్తడే..!
రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన బండి సంజయ్ ఇప్పుడు రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేయలేని స్థితిలో ఉన్నారు. కారణం బీజేపీలోని సీనియర్లేనట.. ఇతర పార్టీల నుంచి వచ్చిన డీకే అరుణ, జితేందర్ రెడ్డి సహా గడ్డం వివేక్ లాంటి సీనియర్లు.. బీజేపీలో ఉన్న లక్ష్మణ్, ఎంవీఎస్ ప్రసాద్, చింతల రాంచంద్రారెడ్డి లాంటి వారు ప్రస్తుతం తెలంగాణ బీజేపీ కార్యవర్గంలో ఉన్నారు.వీరందరినీ తొలగించి యువరక్తాన్ని నింపాలని చూస్తున్న బండి సంజయ్ ఆ సాహసం చేయలేకపోతున్నారు.
ఈ క్రమంలోనే ఈ క్లిష్ట పరిస్థితిపై అధిష్టానం సలహా అడిగారట బండి సంజయ్. కేంద్రంలోని బీజేపీ అధిష్టానం తెలంగాణలోని సీనియర్ నేతలందరినీ బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి తీసుకొని పదవులు ఇస్తామని.. తెలంగాణలో బీజేపీ కార్యవర్గాన్ని యువరక్తంతో నింపాలని బండి సంజయ్ కి సూచించినట్టు తెలిసింది.
Also Read: సోము వీర్రాజు ఎంపికలో సామాజిక కోణం
ఈ క్రమంలోనే కరోనా పరిస్థితులు చక్కబడ్డ తర్వాత తెలంగాణలోని బీజేపీ సీనియర్లు కేంద్ర బీజేపీ కార్యవర్గంలోకి వెళ్లిపోతారు. అప్పుడు బండి సంజయ్ యువరక్తాన్ని బీజేపీలో నింపి దూకుడుగా ముందుకెళ్లడానికి రంగం సిద్ధం చేశాడట.. 2023లో రాజకీయ అధికారమే లక్ష్యంగా కేసీఆర్ ను ఢీకొట్టేలా యువ కార్యవర్గాన్ని.. కార్యకలాపాలను డిజైన్ చేసినట్టు తెలిసింది.
ఇలా అధికారం సాధించడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదని.. సీనియర్ నేతల ఒత్తిడికి తలొగ్గకూడదని బండి సంజయ్ కి దిశానిర్ధేశం చేసినట్టు తెలిసింది.
-ఎన్నం