బండ్లగణేశ్ ఒకప్పుడు సినిమాల్లో మంచి కామెడీ నటుడు. తరువాత నిర్మాతగా కొనసాగుతున్నారు. కొద్దిరోజుల నుంచి రాజకీయాలపై సైతం ఆసక్తి పెంచుకుంటున్నారు. 2018లో కాంగ్రెసులో చేరిన బండ్ల గణేశ్ మీడియా ద్వారా చాలా పాపులర్ అయ్యారు. ఓ మీడియా చిట్ చాట్ లో కాంగ్రెస్ గెలవకుంటే బ్లేడ్ తో నాలుక కోసుకుంటానని సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ ఓటమి తరువాత కనుమరుగైపోయారు. అప్పుడప్పుడూ మీడియా ముందుకు వచ్చినా.. బ్లడ్ మాట తీస్తేనే బారెడు దూరం పరుగు తీస్తున్నారు.
అప్పటి నుంచి ప్రజలు సైతం బండ్ల గణేశ్ తెరపైకి వచ్చాడంటే ఆసక్తిగా చూస్తున్నారు. ఏం కామెంట్లు చేస్తాడో అని చూస్తూ వచ్చారు. చాలా రోజుల తరువాత ఇటీవల కాలంలో హైదరాబాద్ లో వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు హాజరైన బండ్ల గణేశ్ హల్ చల్ చేశారు. తన చేష్టలతో అందరినీ ఆకట్టుకున్నారు. పవన్ కల్యాణ్ ను ఓ రేంజ్ లో ఎత్తున్నారు. శివుడితో పోల్చేశారు. తనకు పవన్ కల్యాణ్ దేవుడని.. పొగడ్తలతో ముంచెత్తారు. ఈ వీడియోలు సైతం ప్రస్తుతం మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.
అయితే సినిమా వేరు రాజకీయాలు వేరు.. సినిమాల్లో కామెడీ మనసును ప్రశాంత పరుస్తుంది. రాజకీయాల్లో కామెడి సదరు నేతలను నవ్వుల పాలు చేస్తోంది. గత ఎన్నికల్లో ఇలాగే బండ్ల గణేశ్, ఏపీలో కేఏ పాల్ హాస్యం పండించారు. అయితే ప్రస్తుతం ఓ యువనేత వీరిని మించిన కామెడీని పండిస్తున్నారు. టీడీపీ యువకెరటం ప్రచార సభలను నవ్వులతో ముంచెత్తుతున్నారు. ఇందుకు తిరుపతి ఉప ఎన్నిక వేదికగా మారుతోంది. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీని గెలిపిస్తే.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామంటూ.. టీడీపీ యువనేత లోకేశ్ బాబు ప్రకటించేశారు. అదే విధంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి 28 రోబోలను పార్లమెంటుకు పంపించారని విమర్శించారు.వైసీపీ ఎంపీలు గొర్రెలని కేంద్రం చెప్పిన దానికి తలాడిస్తున్నారని విమర్శించారు. పనబాక లక్ష్మీని ఎలాగైనా పార్లమెంటుకు పంపించాలని అన్నారు.
ఇలాగే లోకేశ్ చాలా సందర్భాల్లో పలు రకాల కామెంట్లు చేసి హాస్యం పండించారు. తెలిసో.. తెలియకో.. ఘాటు స్పందించాలని బొక్కబోర్ల పడ్డ సందర్భరాలు అనేకం ఉన్నాయి. ప్రతీ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనే లోకేశ్ బాబు ఎం మాట్లాడుతారో అనే గుబులు అక్కడి టీడీపీ నేతల్లో ఉంటోంది. తప్పయినా.. వాస్తవమైనా.. దాన్ని కవర్ చేసేందుకు నేతలు సిద్ధంగా ఉంటున్నారు. కాకపోయే లోకేశ్ తనదైన శైలిలో హాస్యం పండిస్తున్నారంతే..