https://oktelugu.com/

అది ‘ఆత్మరక్షణ’ లేఖ యేనా..?

కొద్దిరోజులుగా వైఎస్ కుటుంబంలో విభేదాల గురించి వివిధ పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో షర్మిల రాజకీయరంగ ప్రవేశానికి సిద్ధం అయ్యారు.. అయితే ఇటీవల వచ్చిన మరో కథనం నేపథ్యంలో వైఎస్. విజయమ్మ రంగంలోకి దిగారు. వైఎస్ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని.. తెచ్చేందుకు కొంతమంది కుట్రలు పన్నుతున్నారని.. వైఎస్ విజయ రాజశేఖరరెడ్డి పేరుతో విడుదల అయిన లేఖ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ లేఖ మొత్తం చదివిన తరువాత ఎవరికైనా జగన్ మోహన్ రెడ్డి రాసినట్టే […]

Written By: , Updated On : April 6, 2021 / 01:53 PM IST
Follow us on

Ys Vijayamma
కొద్దిరోజులుగా వైఎస్ కుటుంబంలో విభేదాల గురించి వివిధ పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో షర్మిల రాజకీయరంగ ప్రవేశానికి సిద్ధం అయ్యారు.. అయితే ఇటీవల వచ్చిన మరో కథనం నేపథ్యంలో వైఎస్. విజయమ్మ రంగంలోకి దిగారు. వైఎస్ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని.. తెచ్చేందుకు కొంతమంది కుట్రలు పన్నుతున్నారని.. వైఎస్ విజయ రాజశేఖరరెడ్డి పేరుతో విడుదల అయిన లేఖ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ లేఖ మొత్తం చదివిన తరువాత ఎవరికైనా జగన్ మోహన్ రెడ్డి రాసినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే.. లేఖ మొత్తంలో జగన్ మెహన్ రెడ్డి నేరుగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తే.. ఎలా ఉంటుందో అలాగే ఉంది.

ఈ లేఖను విజయలక్ష్మి రాసినట్లుగా ముందుగా సాక్షిలో తరువాత వారికి అనుకూల మీడియాలో హైలెట్ చేశారు. ఇంతచేసి ఆ లేఖపై విజయా రాజశేఖర రెడ్డి చేవ్రాలు లేదు. దీంతో ఆ లేఖపై ఇప్పుడు వైసీపీలోనే చర్చ ప్రారంభమైంది. వైఎస్ కుటుంబంలో గొడవ అని ఆంధ్రజ్యోతిలోనో.. ఈనాడు లోనో.. వైఎస్ ఫ్యామిలీ అంటే పడని మరో మీడియానో చెబితే.. గొడవలు జరిగిపోవు కదా..? ఆ కుటుంబంలో అంతా బాగుంటే ఎప్పటికీ బాగుంటుంది.. ఆయా మీడియా వీరి కుటుంబ వ్యతిరేకులని తెలుసు కాబట్టి.. ఎవరూ ట్రాప్ పడరు. కానీ చెల్లి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి.. తనకు అన్యాయం జరిగిందని.. న్యాయం కావాలని గొంతెత్తి అరుస్తోంది. మరో చెల్లి తనకు పార్టీలో ఎందుకు ప్రాధాన్యత ఇవ్వరని ప్రశ్నిస్తోంది.

ఆమె సొంత కుంపటి పెట్టుకోవడం కళ్లముందు కనిపిస్తోంది. వైఎస్ వివేకానంద వర్ధంతికి ఎవరూ వెళ్లలేదన్నది నిజం. ఇవన్నీ కళ్లముందు కనిపిస్తున్నా.. అలవాటయిన పద్ధతిలో చంద్రబాబు మీద తోసేసి.. కప్పి పుచ్చుకోవాలనుకోవడం ఏమిటో.. చాలా మందికి అర్థం కాని అంశం. వైఎస్ వివేకానంద హత్యకేసుపై పవన్ కల్యాణ్ విమర్శలు చేశారంటూ.. విజయమ్మ గింజుకున్నారు. నిజానికి ఆ విమర్శలు పవన్ కల్యాణ్ చాలా లేటుగా చేశారు. చాలా కాలం నుంచి వివేకానంద కూతురు సునీత చేస్తున్నారు.

సీబీఐ విచారణ కోసం కోర్టుకు వెళ్లినప్పుడు.. ఆమెకు ఎందుకు న్యాయం చేయలేదు..? పదవిలోకి వచ్చాక తొమ్మిది నెలల పాటు ఎందుకు విచారణ జరగనీయలేదో.. ఆమెకు తెలుసు కాబట్టి సీబీఐ కోర్టుకు వెళ్లారు. కుటుంబంలో గొడవలను .. విభేదాలను.. ప్రతిపక్ష పార్టీలు.. సమాచారం ఇచ్చే మీడియాలపైకి తోసేసి.. నాలుగైదు పేజీ లేఖరాస్తూ.. అంతా సమసి పోతుందన్న సలహా ఇస్తున్నారు. అంతే కాకుండా నచ్చని మీడియాపై.. చంద్రబాబు నాయుడుపై నిందలేసి.. రాజకీయం చేస్తే.. అది కుటుంబ రాజకీయం అవుతుందని గుర్తించాలని కొందరు అంటున్నారు.