ఆంధ్రప్రదేశ్‌వైఎస్ జగన్, షర్మిలకు చెక్ పెట్టడానికే కేసీఆర్ వ్యూహం?

వైఎస్ జగన్, షర్మిలకు చెక్ పెట్టడానికే కేసీఆర్ వ్యూహం?

తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ మధ్య మరోమారు జల వివాదాలు చోటుచేసుకోనున్నాయి. ఇన్నాళ్లు మిత్రులుగా మెలిగిన కేసీఆర్ జగన్ ఉన్నట్లుండి శత్రువులుగా మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయని ఇరు పార్టీల వర్గాలు భావిస్తున్నాయి. దీనికి కారణం జగన్ చెల్లెలు షర్మిల అని చెబుతున్నారు. ఆమె ఎంత చెప్పినా వినకుండా తెలంగాణలో పార్టీ పెట్టి కేసీఆర్ పైనే విరుచుకు పడుతుండడంతో కేసీఆర్ వ్యూహాత్మకంగా షర్మిలను కట్టడి చేసే క్రమంలో జగన్ పై కయ్యానికి కాలు దువ్వుతున్నట్లు సమాచారం.

ఉమ్మడి రాష్ర్టంలో కృష్ణానదిపై దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మించిన పోతిరెడ్డిపాటు హెడ్ రెగ్యులేటరీ ప్రాజెక్టు అంశాన్ని కేసీఆర్ తనకు అనుకూలంగా మార్చుకోనున్నట్లు తెలుస్తోంది. కృష్ణానదికి సంభవించే వరదల సమయంలో అదనపు జలాలను పోతిరెడ్డిపాడు నుంచే రాయలసీమ జిల్లాలకు తరలించడానికి జగన్ సర్కారు నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం మరోసారి రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది.

రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై మొదట్లో పెద్దగా పట్టించుకోని కేసీఆర్ ఇఫ్పుడు దాన్ని ప్రస్తావనకు తీసుకోవడానికి షర్మిల ఓ కారణంగా భావిస్తున్నారు జులై 8వ తేదీన తన తండ్రివైఎస్సార్ జయంతి సందర్భంగా వైఎస్సార్ టీపీ ప్రకటించడానికి సిద్ధమవుతున్న షర్మిలకు చెక్ పెట్టడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెరమీదకు తీసుకురానున్నట్లు చెబుతున్నారు. ఈ విషయంపై షర్మిల తన వైఖరి తెలియజేయాలని డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో ఆలస్యంగానైనా కేసీఆర్ తన వైఖరి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఆయన వైఎస్ జగన్ ను మూర్ఖుడిలా అభివర్ణించినట్లు వార్తలొచ్చాయి. ఘాటుగా స్పందించడం ద్వారా ఏపీతో తెలంగాణ ప్రభుత్వం ఘర్షణ వైఖరి తెరమీదకు తీసుకున్నట్లయింది. దీంతో జల వివాదాలపై మొదటి నుంచి తెలంగాణ మెతక వైఖరినే ప్రదర్శిస్తున్నట్లు తెలిసిందే. ఇక అమీతుమీ తేల్చుకోవడానికే సిద్ధమైనట్లు సమాచారం.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

FIFA World Cup : 19, 20 తేదీల్లో అర్ధరాత్రి మద్యం అమ్మకాలు.. ఎందుకంటే..

FIFA World Cup : తెలంగాణలో ఫిఫా వరల్డ్ కప్‌ ప్రసారాల నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలోని బార్లు, క్లబ్బులు, మైక్రోబ్రూవరీలకు ప్రభుత్వం ప్రత్యేకంగా పని వేళలు పొడిగించింది. ఈ నెల 19న తెల్లవారుజామున...

Former Editor : ఆ మాజీ ఎడిటర్ కు అవసరమొచ్చినప్పుడల్లా.. తెలంగాణ వాదం గుర్తుకొస్తుంది..

Former Editor : కరువు వచ్చినప్పుడే నీటి విలువ తెలుస్తుంది. వర్షం కురిసినప్పుడే.. గూడు విలువ అర్థమవుతుంది. ఇప్పుడు ఆయనకు అధికారం లేదు. వాడేందుకు ఎర్రబుగ్గ కారు లేదు. అందువల్లే ఆయనకు ఆకస్మాత్తుగా...

Most Popular

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....
Exit mobile version