https://oktelugu.com/

టీడీపీ నేత ధూళిపాళ్ల అరెస్ట్.. జగన్ ప్రతీకారం

ప్రెస్ మీట్లలో జగన్ ను.. వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేసే మరో సీనియర్ టీడీపీ నేత బుక్కయ్యాడు. జగన్ సర్కార్ లూప్ హోల్స్ వెతికి మరీ ఈరోజు ఉదయం ఆయనను అరెస్ట్ చేసింది. దీంతో టీడీపీలో మరో వికెట్ పడినట్టైంది. గద్దెనెక్కినప్పటి నుంచి జగన్ ను తీవ్రంగా విమర్శించిన టీడీపీ నేతలందరినీ ఏదో కేసులో పెట్టి జగన్ సర్కార్ జైలుకు పంపుతోంది. ఇప్పుడు ప్రెస్ మీట్లలో జగన్ పై ఒంటికాలిపై లేచే టీడీపీ సీనియర్ నేత […]

Written By:
  • NARESH
  • , Updated On : April 23, 2021 9:32 am
    Follow us on

    ప్రెస్ మీట్లలో జగన్ ను.. వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేసే మరో సీనియర్ టీడీపీ నేత బుక్కయ్యాడు. జగన్ సర్కార్ లూప్ హోల్స్ వెతికి మరీ ఈరోజు ఉదయం ఆయనను అరెస్ట్ చేసింది. దీంతో టీడీపీలో మరో వికెట్ పడినట్టైంది.

    గద్దెనెక్కినప్పటి నుంచి జగన్ ను తీవ్రంగా విమర్శించిన టీడీపీ నేతలందరినీ ఏదో కేసులో పెట్టి జగన్ సర్కార్ జైలుకు పంపుతోంది. ఇప్పుడు ప్రెస్ మీట్లలో జగన్ పై ఒంటికాలిపై లేచే టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కూడా టార్గెట్ అయ్యారు.

    తాజాగా గుంటూరు జిల్లా చింతలపూడిలోని ధూళిపాళ్ల నివాసంలో పోలీసులు ఈరోజు ఉదయం ఆయన ఇంటిని చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. ధూళిపాళ్ల అరెస్ట్ కోసం దాదాపు 100 మంది పోలీసులను తెల్లవారుజామునే ఆయన ఇంటి వద్ద మోహరించారు. అనంతరం పోలీస్ వాహనంలో ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అయితే ఆయనను ఎందుకు అరెస్ట్ చేశారన్న విషయాన్ని మాత్రం పోలీసులు తెలుపకపోవడం విశేషం.

    అయితే ధూళిపాళ్ల ప్రస్తుతం సంగం డెయిరీ చైర్మన్ గా ఉన్నారు. ఆ సంస్థలో అవినీతి అక్రమాల ఆరోపణలున్నాయని తెలిసింది. దీనిపై ఏసీబీ ద్వారా విచారణ జరిపించిన సీఎం జగన్ అక్రమాలు నిగ్గుతేలడంతో ధూళిపాళ్లపై ఏకంగా ఆరు కేసులు నమోదు చేసి ఉచ్చు బిగించినట్టు తెలుస్తోంది.

    సంగం డెయిరీ ఆస్తులను కొల్లగొట్టడానికి కుట్ర పన్నారని.. ధూళిపాళ్లకు ప్రభుత్వం ఇచ్చిన 10 ఎకరాల భూమిని సొంతంగా వాడుకుంటూ కాలేజీ ఏర్పాటు చేయలేదని ఆరోపణలు ఉన్నాయి. ఇక వేతనాలు, సిబ్బంది నియమాకాలు, ఆర్థిక అంశాల్లోనూ సంగం డెయిరీలో ఆరోపణలు రావడంతో జగన్ సర్కార్ పక్కా స్కెచ్ తో ప్లాన్ చేసినట్టు సమాచారం.

    రాజధాని భూముల వ్యవహారంలోనూ ధూళిపాళ్ల పాత్ర ఉందని.. ఆయనను అరెస్ట్ చేసిన సమాచారం. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక వివరణ రావాల్సి ఉంది.