
తెరాస కార్యనిర్వాహక కార్యదర్శ, మంత్రి కేటీఆర్ కు కరోనా సోకింది. కరోనా పరీక్షల్లో తనకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ట్విట్టర్ ద్వారా ఆయన వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉండడంతో హొం ఐసోలేషన్ లో ఉన్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. కాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా బారిన పడిన విషయం అందరికి తెలిసిందే.
