https://oktelugu.com/

కరోనపై నిర్లక్ష్యం వహించింది ఇద్దరే ట్రంప్, జగన్

జగన్మోహన్ రెడ్డి అసమర్థ పరిపాలన వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. విజయవాడలో మీడియాతో మాట్లాడారు. కరోనా విషయంలో పారాసెట్మాల్, బ్లీచింగ్ పౌడర్, సాధారణ జ్వరం అంటూ జగన్ అవగాహనలేమి వల్ల కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నట్లు చెప్పారు. దేశంలోనే అత్యధిక కేసులు రాష్ట్రంలో నమోదవుతున్నాయి. ప్రపంచం మొత్తం కరోనాను సీరియస్ గా తీసుకుంటుంటే.. జగన్మోహన్ రెడ్డి అత్యంత తేలిక భావంతో ఉన్నారని తెలిపారు. ప్రపంచంలో కరోనా పట్ల మూర్ఖంగా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 28, 2020 / 05:13 PM IST
    Follow us on


    జగన్మోహన్ రెడ్డి అసమర్థ పరిపాలన వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. విజయవాడలో మీడియాతో మాట్లాడారు. కరోనా విషయంలో పారాసెట్మాల్, బ్లీచింగ్ పౌడర్, సాధారణ జ్వరం అంటూ జగన్ అవగాహనలేమి వల్ల కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నట్లు చెప్పారు. దేశంలోనే అత్యధిక కేసులు రాష్ట్రంలో నమోదవుతున్నాయి. ప్రపంచం మొత్తం కరోనాను సీరియస్ గా తీసుకుంటుంటే.. జగన్మోహన్ రెడ్డి అత్యంత తేలిక భావంతో ఉన్నారని తెలిపారు. ప్రపంచంలో కరోనా పట్ల మూర్ఖంగా మాట్లాడిన మొదటి వ్యక్తి ట్రంప్ అయితే.. రెండో వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. సీఎం తీరు వల్లే రాష్ట్రంలో కేసులు ఎక్కువగా ప్రబలుతున్నాయని జగన్, వైసీపీ ధనదాహానికి టెస్టింగ్ కిట్లలో కూడా కోట్ల రూపాయల అవినీతి జరుగిందని తెలిపారు. వైద్య సిబ్బందికి మాస్కులు లేవని, కనీస సదుపాయాలు కూడా వారికి కల్పించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు.

    రాష్ట్రంలో 13 జిల్లాల్లో రైతుల కోసం జగన్ తీసుకున్న చర్యలు ఏంటని ప్రశ్నించారు. లాక్ డౌన్ ప్రక్రియ మొదలైన తర్వాత రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం ఎన్ని టన్నులు ధాన్యం కొనుగోలు చేసింది, ఎంతమేర చెల్లింపులు చేశారు. 50 లక్షల మెట్రిక్ టన్నుల పైచిలుకు ధాన్యం దిగుబడులు వస్తే రెండు, మూడు లక్షలు కూడా కొనుగోలు చేయలేదన్నారు. వీటికి కూడా సరిగా నగదు చెల్లింపులు చేయలేదని తెలిపారు. 13 జిల్లాల్లో వరి ఎంత పండింది, ఎంత కొనుగోలు చేశారు, రైతులకు చెల్లించిన మొత్తం తదితర అంశం పై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యానవన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, పూలతోటల రైతులు నాశనం అయ్యారన్నారు. ఆక్వా రైతులు పూర్తిగా నష్టపోయారని తెలిపారు. 40 రోజుల వ్యవధిలో ఒక్క టన్ను రొయ్యలు కానీ, చేపలు కానీ కొన్నారా అని ప్రశ్నించారు. మద్దతు ధర చెల్లించారా. రూ.3వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైందన్నారు. కనీసం 3 రూపాయలు కూడా ఇవ్వలేదు.

    రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారని, అసంఘటిత కార్మికులు, ఆటో డ్రైవర్లు, కులవృత్తులు చేసుకునే వారు పస్తులతో ఉంటున్నారని తెలిపారు. దీనికి కారణం జగన్ అసమర్థత కాదా అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణమాఫీ చేస్తామన్న హామీ ఏమైందన్నారు. మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయని, కరోనాతో జీవితాంతం ఉండాల్సి వస్తుందని నిన్న జగన్ మాట్లాడటం అసమర్థతకు నిదర్శనమన్నారు. వైసీపీ నేతలు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించబట్టే కరోనా విస్తృతమవుతోందని, జగన్ పేద కుటుంబాలను ఏ విధంగానూ ఆదుకోలేదని తెలిపారు. దీనిపై టీడీపీ పోరాడుతుందని చెప్పారు.