ఆ మంచి పనికి మేము సిద్ధం:అసదుద్దీన్

కరోనా వైరస్‌ సోకి కోలుకున్న 32 మందిని ప్లాస్మా దానం చేయాల్సిందిగా తాను స్వయంగా కోరినట్లు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ తెలిపారు. దానికి వారు సుముఖత వ్యక్తం చేశారని, వారి వివరాలను ప్రభుత్వానికి అందచేస్తున్నా అని ఆయన పేర్కొన్నారు. దాదాపు 32 మంది ప్లాస్మా ఇచ్చేందుకు రెడీ అయ్యారని.. తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్‌, మంత్రి కేటీఆర్‌ కు లేఖలు రాశారు. వారి పేర్లను కూడా జత చేస్తూ లేఖను పంపించారు అసదుద్దీన్. హైదరాబాద్‌ […]

Written By: Neelambaram, Updated On : April 28, 2020 4:59 pm
Follow us on

కరోనా వైరస్‌ సోకి కోలుకున్న 32 మందిని ప్లాస్మా దానం చేయాల్సిందిగా తాను స్వయంగా కోరినట్లు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ తెలిపారు. దానికి వారు సుముఖత వ్యక్తం చేశారని, వారి వివరాలను ప్రభుత్వానికి అందచేస్తున్నా అని ఆయన పేర్కొన్నారు. దాదాపు 32 మంది ప్లాస్మా ఇచ్చేందుకు రెడీ అయ్యారని.. తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్‌, మంత్రి కేటీఆర్‌ కు లేఖలు రాశారు. వారి పేర్లను కూడా జత చేస్తూ లేఖను పంపించారు అసదుద్దీన్.

హైదరాబాద్‌ లోని గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. కోవిడ్-19 చికిత్సలో భాగంగా ప్లాస్మా థెరపీకి అనుమతి లభించింది. కరోనా నుంచి కోలుకున్న వారి ప్లాస్మాను వైద్యులు సేకరించనున్నారు. సీరియస్‌ కండీషన్‌ లో ఉన్నవారికి ఈ ప్లాస్మా థెరపీ ఉపయోగపడనుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ ఒవైసీ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు

కరోనా సోకి, దాని నుంచి కోలుకున్న ముస్లిం సోదరులు కరోనా‌తో పోరాడుతున్న ఇతరులకు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు వస్తున్నారు. అయితే.. ప్లాస్మా థెరపీతో కరోనాను కట్టడి చేయవచ్చని వైద్యులు నిరూపిస్తున్న తరుణంలో కరోనాను జయించిన వాళ్లు ప్లాస్మా ఇచ్చేందుకు విముఖత చూపిస్తున్నట్లు అసదుద్దీన్‌ తెలిపారు.