https://oktelugu.com/

కరోనా టైంలో.. హిమచల్‌ ప్రదేశ్‌లో భూకంపం

దేశంలో కరోనా ఎంట్రీతో కేంద్రం లాక్డౌన్ అమలు చేస్తోంది. దీంతో ప్రజలంతా తమ ఇళ్లకే పరిమితమై ప్రభుత్వాలకు సహకరిస్తున్నారు. అయినప్పటికీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వరుస భూకంపాలు ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం సంభవించినట్లు సమాచారం. మంగళవారం మధ్యాహ్నం 12.17నిమిషాలకు చంబా ప్రాంతంలో భూప్రకంనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. గతంలోనూ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 28, 2020 / 05:19 PM IST
    Follow us on


    దేశంలో కరోనా ఎంట్రీతో కేంద్రం లాక్డౌన్ అమలు చేస్తోంది. దీంతో ప్రజలంతా తమ ఇళ్లకే పరిమితమై ప్రభుత్వాలకు సహకరిస్తున్నారు. అయినప్పటికీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వరుస భూకంపాలు ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం సంభవించినట్లు సమాచారం. మంగళవారం మధ్యాహ్నం 12.17నిమిషాలకు చంబా ప్రాంతంలో భూప్రకంనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.

    గతంలోనూ ఈ ప్రాంతంలో స్వల్పంగా భూకంపం వచ్చిందని అప్పటి తీవ్రత 3.1గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. భౌగోళిక స్థానం కారణంగా ప్రతీయేటా హిమచల్ ప్రదేశ్లో తేలికపాటి భూకంపాలు తరుచూ సంభవిస్తుంటాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం సంభవించిన భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టంగానీ జరుగలేదని అధికారులు చెబుతున్నారు. కరోనా ఎఫెక్ట్ తో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్న సమయంలో భూకంపాలు వస్తుండటంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

    ఇటీవల దేశరాజధాని ఢిల్లీలోనూ వరుసగా రెండ్రోజుల స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలంతా ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఇక్కడ కూడా ఎలాంటి ప్రాణనష్టం జరుగకపోవడం ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. కరోనా టైంలో వరుసగా భూకంపాలు వస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.