TDP: రాజ్యసభపై టీడీపీ నజర్‌.. అభ్యర్థిని పెడితే గెలవాల్సిందే!

వైసీపీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థిని నిలిపితే అనుకూలంగా ఓటు వేస్తామని హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయినా బలం సరిపోకపోవడంతో మరికొందరితో కూడా టీడీపీ నేతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

Written By: Raj Shekar, Updated On : February 5, 2024 3:23 pm
Follow us on

TDP: రాజ్యసభకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరుగనున్నాయి. ఈమేరకు ఇప్పటికే షెడ్యూల్‌ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి మూడు స్థానాలకు నోటిషికేషన్‌ విడుదల కానుంది. మూడు స్థానాలు వైసీపీ ఖాతాలోనే చేరాలి. కానీ, ఎన్నికలకు రెండు నెలల ముందు జరిగే ఈ ఎన్నికల్లో వైసీపీకి ఝలక్‌ ఇవ్వాలని చూస్తోంది ప్రతిపక్ష టీడీపీ. ఈమేరక పక్కా ప్లాన్‌తో అడుగులు వేస్తోంది. టీడీపీకి కేవలం 22 మంది బలం మాత్రమే ఉంది. వైసీసీ రెబల్‌ ఎమ్మెల్యేలు మరో ఐదుగురు ఉన్నారు. అయినా బలం లేదు. కానీ, బరిలో నిలిచేందుకు వ్యూహం రచిస్తోంది. ఇప్పటికే రాజ్యసభ ఎన్నికలపై ఓ టీమ్‌ పనిచేస్తోంది. పార్టీ బలం ఎంత.. ఎంతమంది టీడీపీకి అనుకూలంగా ఓటు వేస్తారు.. అని ఆరా తీస్తున్నారు.

క్రాస్‌ ఓటింగ్‌పై ఆశలు..
కమిటీ నివేదిక ప్రకార… వైసీపీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థిని నిలిపితే అనుకూలంగా ఓటు వేస్తామని హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయినా బలం సరిపోకపోవడంతో మరికొందరితో కూడా టీడీపీ నేతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కొంత మంది ఎమ్మెల్యేలు జనసేన చీఫ్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశాలను టీడీపీ కమిటి అధ్యయనం చేస్తోంది.

టికెట్‌ ఎవరికి..
ఇదిలా ఉంటే.. టీడీపీ రాజ్యసభ అభ్యర్థి కూడా వైసీపీ క్రాస్‌ ఓటింగ్‌లో కీలకంగా మారే అవకాశం ఉంది. దళిత అభ్యర్థిని నిలపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అధికార వైసీపీ దళిత ఓట్ల కోసం రాజకీయం చేస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ కూడా రాజ్యసభ అభ్యర్థిని బరిలో నిలిపితే దళిత ఓట్లు కొల్లగొట్టేలా దళితుడిని బరిలో నిలిపే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నియోజకవర్గాల టికెట్లు ప్రకటిస్తున్నారు. ఇందులో 28 మంది దళితులు టికెట్‌ కోల్పోయారు. దీంతో రాజ్యసభకు అందులోని ఓ దళితుడిని ఎంపిక చేయడం ద్వారా వైసీపీ నుంచి క్రాస్‌ ఓటింగ్‌ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు టికెట్‌ నిరాకరించిన ఎమ్మెల్యేలంతా టీడీపీకి ఓటు వేస్తారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ రాజ్యసభ బరిలో నిలిచేందుకు సిద్ధమవుతోందని సమాచారం.