TDP Looking For Alliances: ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పొత్తుల కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్రంలో మరోమారు అధికారం కావాలంటే అయితే బీజేపీ లేదంటే పవన్ కల్యాణ్ తో పొత్తు ఉంటేనే సాధ్యమవుతుందనే వాదన వస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ పొత్తు కోసం ఆరాటపడుతోంది. రాజకీయాలకే కొత్త భాష్యం చెప్పిన టీడీపీ ప్రతిసారి పొత్తులతోనే గట్టెక్కింది. పొత్తు లేకపోతే దాని ప్రభావం శూన్యమే అని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక పార్టీతో జతకడితేనే ప్రయోజనం ఉంటుందనేది కార్యకర్తల విశ్వాసం.
1983లో పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టింది. కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసిన టీడీపీ ఏకంగా 200 స్థానాల్లో విజయదుందుబి మోగించి అధికారం దక్కించుకుంది. తరువాత 1989 ఎన్నికల్లో ఓటమి పాలైంది. 1994 ఎన్నికల్లోనూ కమ్యూనిస్టులతో కలిసి మరోమారు విజయం సాధించి ఎదురులేని పార్టీగా నిలిచింది. 2009లో టీఆర్ఎస్, కమ్యూనిస్టులతో కలిసి మహాకూటమిగా ఏర్పడినా విజయం వరించలేదు. 2014లో బీజేపీ, పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకుని మరోమారు సత్తా చాటింది. 2019 ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా పోటీచేసి చేయి కాల్చుకుంది.
Also Read: Janasena: స్పీడ్ పెంచిన జనసేనాని.. పవన్ ప్రసంగాల్లో పెరిగిన వాడీవేడీ
ఈ నేపథ్యంలో టీడీపీకి పొత్తులే కలిసొస్తాయనే నమ్మకం ఏర్పడింది. అందుకే పొత్తు విషయంలో ద్వారాలు తెరిచే ఉన్నా ఎవరు కూడా రావడం లేదు. ఇక కమ్యూనిస్టుల కాలం అయిపోయింది. వారు ఎక్కడ కూడా పోటీకి సిద్ధంగా లేరనే విషయం తెలుస్తోంది. ఈ క్రమంలో బీజేపీ, పవన్ కల్యాణ్ తో జత కట్టాలని చూస్తోంది. కానీ ఇంకా పొత్తుల విషయంలో మాత్రం క్లారిటీ లేదు. మొత్తానికి బాబు మాత్రం పొత్తులు ఉంటేనే విజయం వరిస్తుందనే ధీమాలో ఉన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే టీడీపీ పొత్తులతోనే కాలం వెళ్లదీసింది. దీంతో ఈసారి కూడా పొత్తులతోనే గెలవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ఎన్నికలకు ముందే పొత్తుల కోసం ఆరాటపడుతోంది. కానీ అవి మాత్రం సానుకూలత వ్యక్తం చేయడం లేదు. పార్టీ నేతలు మాత్రం సొంతంగానే పోటీ చేసి తన పంతం నెగ్గించుకోవాలని ఆలోచిస్తోంది. పొత్తుల విషయంలో చంద్రబాబు ఆశలు ఫలిస్తాయా? లేక ఒంటరిగానే పోటీ చేస్తుందా అనేది తేలాల్సి ఉంది.
Also Read: Somu Veeraju: టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకుంటే.. బీజేపీ స్టాండ్ ఏమిటి?
Recommended Videos: